PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-focus-on-ycp-candidates-lands33dc9c47-a15e-4039-94fb-c26f059d7ead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-government-focus-on-ycp-candidates-lands33dc9c47-a15e-4039-94fb-c26f059d7ead-415x250-IndiaHerald.jpgవైసీపీ హయాంలో ఉత్తరాంధ్రాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు చోటు చేసుకున్నట్లు చోటు చేసుకున్నట్లు టీడీపీ కూటమి అనుమానిస్తోంది. ఈ వ్యవహారమై ఓ సమగ్రమైన విచారణ జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని భూములను ఇతరులనుంచి లాగేసుకున్నట్లు ఇనిషియల్ రిపోర్టులో తేలింది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో దేన్నీ వదల లేదని కూడా తెలుస్తోందిYcp{#}DHARMANA PRASADA RAO;Srikakulam;Arrest;Uttarandhra;Vishakapatnam;MP;YCP;Janasena;TDP;Governmentవైసీపీ నేతల భూదందాపై కూటమి ప్రభుత్వం ఫోకస్.. వారికి షాక్ తప్పదా?వైసీపీ నేతల భూదందాపై కూటమి ప్రభుత్వం ఫోకస్.. వారికి షాక్ తప్పదా?Ycp{#}DHARMANA PRASADA RAO;Srikakulam;Arrest;Uttarandhra;Vishakapatnam;MP;YCP;Janasena;TDP;GovernmentWed, 03 Jul 2024 18:16:00 GMT
వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రాలో పెద్ద ఎత్తున భూకబ్జాలు చోటు చేసుకున్నట్లు చోటు చేసుకున్నట్లు టీడీపీ కూటమి అనుమానిస్తోంది. ఈ వ్యవహారమై ఓ సమగ్రమైన విచారణ జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని భూములను ఇతరులనుంచి లాగేసుకున్నట్లు ఇనిషియల్ రిపోర్టులో తేలింది. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో దేన్నీ వదల లేదని కూడా తెలుస్తోంది.

అసైన్డ్ ల్యాండ్ కూడా చప్పుడు కాకుండా కబ్జా చేశారని, చాలా మంది అమాయకులను బెదిరించి సైలెంట్ చేశారని టీడీపీ సర్కార్ చెబుతోంది. విశాఖ, శ్రీకాకుళం ఇలా అన్ని జిల్లాల్లోనూ దాదాపు 30-40 వేల ఎకరాలను వైసీపీ నేతలు అక్రమంగా తన పేరున రాయించుకున్నారని సమాచారం. వైసీపీ హయాంలో రెవిన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు కూడా భూముల అక్రమ స్వాధీనాలపై పెదవి విప్పారు.

వైసీపీ నేతలు ఉత్తరాంధ్రాలోనూ చాలామంది భూములను కబ్జా చేసినట్లు టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ, జీవీల మీద నాన్‌-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది కూడా భూవివాదాల విషయంలోనే అని చాలామంది అంటున్నారు. 

గతంలో ఓ వైసీపీ రాజకీయ నేత ఇన్ చార్జిగా ఉంటూనే విశాఖలో భూ చోరీలకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ఈ భూకబ్జాలో గత ప్రభుత్వంలోని ఓ అధికారి ప్రమేయం సైతం ఉన్నట్లు చెబుతున్నారు. ఎవ్వరినీ మినహాయించకుండా ఈ విషయాలను పరిశీలించేందుకు త్వరలో విచారణ కమిటీని నియమించాలని భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, భూకబ్జాలపై తగు చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల కూడా పూర్తి కాకుండానే ఉత్తరాంధ్ర భూవివాదాన్ని పరిష్కరించే పనిలో పడింది. ఈ భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఎవరెవరూ కటకటాల వెనక్కి వెళ్తారో చూడాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>