PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-is-there-no-sympathy-for-kcr-and-jaganea4d3e59-808d-48c0-887e-b3bc8d2272b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-is-there-no-sympathy-for-kcr-and-jaganea4d3e59-808d-48c0-887e-b3bc8d2272b9-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పటం కంటే.. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేయటం మొదలుపెట్టాక ఏడాదిపాటు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగారు. 2018లో తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక‌.. 2019లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక.. యేడాదిన్న‌రపాటు చాలా స్నేహంగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరికీ చెడింది. కట్ చేస్తే గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో కెసిఆర్ తెలంగాణలో ఓడిపోయారు. అప్పటినుంచి బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ శరవేగంగా పతనమౌతూ వస్తోంది. AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; kcr{#}KTR;media;Parliament;MP;House;Jagan;Telugu;KCR;Telangana;Telangana Chief Minister;Party;Andhra Pradesh;YCPకేసీఆర్‌, జ‌గ‌న్ మీద సానుభూతి ఎందుకు లేదు... ?కేసీఆర్‌, జ‌గ‌న్ మీద సానుభూతి ఎందుకు లేదు... ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; kcr{#}KTR;media;Parliament;MP;House;Jagan;Telugu;KCR;Telangana;Telangana Chief Minister;Party;Andhra Pradesh;YCPWed, 03 Jul 2024 08:28:33 GMTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు మంచి స్నేహితులు అని చెప్పటం కంటే.. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేయటం మొదలుపెట్టాక ఏడాదిపాటు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగారు. 2018లో తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక‌.. 2019లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక.. యేడాదిన్న‌రపాటు చాలా స్నేహంగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరికీ చెడింది. కట్ చేస్తే గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో కెసిఆర్ తెలంగాణలో ఓడిపోయారు. అప్పటినుంచి బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ శరవేగంగా పతనమౌతూ వస్తోంది. ఇక మేలో జరిగిన ఎన్నికలలో జగన్ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ పతనం మామూలుగా లేదు.


గత ఐదేళ్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఈ ఇద్దరిపై ఎంతో కొంత సానుభూతి ఉండాలి. అయితే ఎందుకు సానుభూతి లేదు.. ? అన్న ప్రశ్నకు చాలా జవాబులు కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్ర మొత్తం మీద బీఅర్ఎస్‌ కు ఒకటంటే ఒక ఎంపీ సీటు కూడా దక్కలేదు. కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, బిఆర్ఎస్ మీద కానీ తెలంగాణ ప్రజలకు అస్సలు సానుభూతి లేదు. దీనికి కారణం ఏంటని.. ? ప్రశ్నించుకుంటే కేసిఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో పాటు.. అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన చేయటం, పార్టీలో ఎవరిని ఎదగనీయకపోవడం, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక అహంభావం ఎక్కువ కావటం, ప్రతిపక్షాలను పూర్తిగా అణిచివేయటం ఇవన్నీ తెలంగాణ ప్రజలలో కేసీఆర్ కుటుంబం పట్ల.. బిఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్రమైన ద్వేష భావాన్ని కలిగించాయి.


అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల ఒక్కరు కూడా సానుభూతి చూపటం లేదు. ఇక జగన్ విషయానికి వస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలను మెప్పించే పాలన చేయలేదు.. అప్పులు చేసుకుంటూ పోతూ.. బటన్ నొక్కుతూ సంక్షేమం అంటూ కాలం గడిపేశారు. ఎవరి సలహాలు వినకుండా సొంత నిర్ణయాలతో పాలన చేసి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. చివరకు సొంత పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జగన్ ను కలిసే అవకాశం ఇవ్వలేదు. చివరకు జగన్ ఐదేళ్లలో బయటకు వచ్చింది లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఎప్పుడన్నా బయటకు వచ్చిన పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ జగన్‌ను కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంతో పాటు.. జగన్ పట్ల ఏమాత్రం సానుభూతి లేకుండా చేయటానికి కారణమయ్యాయి. చివరకు సొంత ఫ్యామిలీ సైతం జగన్‌కు దూరమైన పరిస్థితి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>