MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan3bdc0014-447a-43b2-baa8-1cad51d989d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan3bdc0014-447a-43b2-baa8-1cad51d989d2-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా శంకర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది అని , ఆ పది రోజుల్లో షూటింగ్ ను భారతీయుడు 2 సినిమా విడుదల కాగానే పూర్తి చేస్తాము అని తెలియజేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చరణ్ నటించబోతున్నాడు. ఈ మcharan{#}Lokesh;Kumaar;Shiva;Pawan Kalyan;sana;shankar;sukumar;India;GEUM;Cinema;Tamil;Music;lord siva;Hero;Lokesh Kanagaraj;Manam;Bharateeyuduతమిళ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..?తమిళ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడే..?charan{#}Lokesh;Kumaar;Shiva;Pawan Kalyan;sana;shankar;sukumar;India;GEUM;Cinema;Tamil;Music;lord siva;Hero;Lokesh Kanagaraj;Manam;BharateeyuduWed, 03 Jul 2024 09:37:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా శంకర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది అని , ఆ పది రోజుల్లో షూటింగ్ ను భారతీయుడు 2 సినిమా విడుదల కాగానే పూర్తి చేస్తాము అని తెలియజేశాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చరణ్ నటించబోతున్నాడు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా , శివ రాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చరణ్ , సుకుమార్ తో చేయబోయే సినిమా తర్వాత మూవీ ని కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు ఇప్పటికే చరణ్ కు ఓ స్టోరీని చిన్న లైన్ గా చెప్పినట్లు , అది చరణ్ కి అద్భుతంగా నచ్చడంతో మనం త్వరలోనే సినిమా చేద్దాం అని ఈయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటే , లోకేష్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరు కూడా రెండు , మూడు సంవత్సరాల తర్వాత కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>