MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adc370e843-b6ae-402a-aa40-9e59ffb410eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adc370e843-b6ae-402a-aa40-9e59ffb410eb-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న కల్కి? ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన బాహుబలి 2 సినిమాతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. నార్త్ ఆడియెన్స్ ప్రభాస్ ప్రతీ సినిమాకు బ్రహ్మరథం పడుKalki 2898 AD{#}Fidaa;Bahubali;Box office;bollywood;Prabhas;Hindi;ashwini dutt;Vyjayanthi Movies;deepika;Chitram;vijay kumar naidu;Director;Cinemaబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న కల్కి?బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న కల్కి?Kalki 2898 AD{#}Fidaa;Bahubali;Box office;bollywood;Prabhas;Hindi;ashwini dutt;Vyjayanthi Movies;deepika;Chitram;vijay kumar naidu;Director;CinemaWed, 03 Jul 2024 12:43:00 GMTబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న కల్కి? 

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన బాహుబలి 2 సినిమాతో హిందీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. నార్త్ ఆడియెన్స్ ప్రభాస్ ప్రతీ సినిమాకు బ్రహ్మరథం పడుతునే ఉన్నారు.ఇప్పుడు కల్కికి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ జనాలు.. ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లో.. డే బై డే కలెక్షన్స్ పెరుగుతునే ఉన్నాయి. ఒక రోజుకి మించి మరో రోజు అన్నట్టుగా.. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి.. బాలీవుడ్‌లో మొత్తం నాలుగు రోజుల్లో 115 కోట్లు కొల్లగొట్టింది కల్కి. 


ఇప్పుడు ఆరు రోజుల్లో ఏకంగా 145 కోట్ల రూపాయల వసూళ్ళని కొల్లగొట్టింది. ఫస్ట్ డే 22.50 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 23.25 కోట్లు, మూడో రోజు 26.25 కోట్లు, నాలుగో రోజున 40.15 కోట్లతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో.. బాలీవుడ్‌లో ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఇలా ఈ సినిమా గత ఆరు రోజుల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు తిరగ రాసింది. తెలుగులో 200 కోట్ల రూపాయలు, తమిళంలో 21 కోట్ల రూపాయలు, హిందీలో 145 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 కోట్ల రూపాయలు ఇంకా కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజున ఇతర సినిమాలు సాధించిన వసూళ్ల కంటే ఎక్కువగా కల్కి సినిమా కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.  ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 625 కోట్ల రూపాయలు వసూలు చేయగా 6వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ మూవీ దాదాపు 680 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక కలెక్షన్లు పెరిగితే ఈ సినిమా ఈరోజుతో 700 కోట్లని దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>