PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu090e7dec-c8d3-4eec-b558-4febe35e8375-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-chandrababu090e7dec-c8d3-4eec-b558-4febe35e8375-415x250-IndiaHerald.jpgకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు విర్రవీగుతూ నానా హంగామా చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా గతంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన హంగామాను మించి కూటమి నేతలు చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా వైసిపి నేతలను హింసించడమే కాకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వైసిపి కార్యాలయాలను కూల్చడంలో కూడా ముందు ఉంటున్నారు. ప్రభుత్వం చెప్పకపోయినా కూడా చాలామంది ఎమ్మెల్యేలు వారంతటకు వారే నిర్ణయాలు తీసుకొని నానా హంగామా చేస్తున్నారు. మరి కొంతమంది పెన్షన్ విషయంలో కూడా కకృతి పడుతున్నట్లు JAGAN ;CHANDRABABU{#}Reddy;CM;Hanu Raghavapudi;TDP;Government;CBN;Jagan;Andhra Pradesh;YCP;Newsఏపీ: అప్పుడు జగన్ ని ముంచారు.. ఇప్పుడు బాబుని.. ఏం జరుగుతోంది..?ఏపీ: అప్పుడు జగన్ ని ముంచారు.. ఇప్పుడు బాబుని.. ఏం జరుగుతోంది..?JAGAN ;CHANDRABABU{#}Reddy;CM;Hanu Raghavapudi;TDP;Government;CBN;Jagan;Andhra Pradesh;YCP;NewsWed, 03 Jul 2024 20:30:00 GMTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు విర్రవీగుతూ నానా హంగామా చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా గతంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన హంగామాను మించి కూటమి నేతలు చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా వైసిపి నేతలను హింసించడమే కాకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వైసిపి కార్యాలయాలను కూల్చడంలో కూడా ముందు ఉంటున్నారు. ప్రభుత్వం చెప్పకపోయినా కూడా చాలామంది ఎమ్మెల్యేలు వారంతటకు వారే నిర్ణయాలు తీసుకొని నానా హంగామా చేస్తున్నారు.


మరి కొంతమంది పెన్షన్ విషయంలో కూడా కకృతి పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తరచూ  ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి అంటూ తెలియజేస్తున్నారు. ఇలా ఆయన అనడం వెనుక ఒక బలమైన కారణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు చుట్టూ ఉన్న మంత్రులు సైతం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని చెప్పలేదట.మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని కేవలం ఊదరగొట్టి ఫలితాలు చూస్తే టిడిపి అట్టర్ ప్లాప్ అయ్యింది.. 2019 నుంచి 2024 వైయస్ జగన్ కూడా మళ్లీ అదే తప్పు చేసినట్లుగా తెలుస్తోంది.


జగన్మోహన్ రెడ్డి కేవలం తన చుట్టూ ఉన్న మంత్రులు ఏం చెబితే అది నమ్ముతూ ఉండేవారు.తిరిగి మెజారిటీతో గెలుస్తామని విధంగా గుడ్డిగా నమ్మారు. ప్రజల దగ్గరకు వెళ్లని లేదు ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోలేదు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనే విషయం ఓటింగ్ తరువాతే తెలిసింది. కూటమి ప్రభుత్వం జూలై 12 నుంచి ఏర్పడిన తర్వాత మొన్న పంచిన పెన్షన్ వరకు ప్రజలను ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. అయితే బాబు భయపడుతున్నదే క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పించన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగస్తులు కొంతమంది ఏపీ సీఎం మోసం చేస్తున్నారట.. ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వకుండా లబ్ధిదారులని తమ దగ్గరకు పిలుచుకునేలా చేస్తూ ఉండడంతో ప్రజలు కాస్త అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు సైతం ప్రభుత్వానికి తెలియకుండా ఇలా చేస్తున్నారు. ఇలాంటి విషయాలను సైతం క్షేత్ర స్థాయిలో చంద్రబాబుకు తెలియకుండానే చేస్తున్నారట. ఇలాగే కంటిన్యూ అయితే చాలా ఇబ్బందులు తప్పవని కూడా చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>