MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc80d65a3-5555-428b-acd0-74d69d5517aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc80d65a3-5555-428b-acd0-74d69d5517aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టైర్ టు హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. చివరిగా ఆయన నటించిన సినిమా రూల్స్ రంజన్. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక సినిమా ఫ్లాప్ కావడం కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. రూల్స్ రంజాన్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ తన తదుపరి సినిమాతో ఎలాగైనా హెట్టు కొట్టాలి అని ఈ సమయాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే tollywood{#}jyothi;kiran;kushi;Ramzan;October;sandeep;media;News;Cinemaభారీ బడ్జెట్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్.. నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా..!?భారీ బడ్జెట్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్.. నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా..!?tollywood{#}jyothi;kiran;kushi;Ramzan;October;sandeep;media;News;CinemaWed, 03 Jul 2024 18:37:59 GMTటాలీవుడ్ టైర్ టు హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. చివరిగా ఆయన నటించిన సినిమా రూల్స్ రంజన్. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మరో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక సినిమా ఫ్లాప్ కావడం కారణంగా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. రూల్స్ రంజాన్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ తన తదుపరి సినిమాతో ఎలాగైనా హెట్టు కొట్టాలి అని ఈ సమయాన్ని

 పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం ఒక పిరియాడికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం వినబడుతుంది. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట. నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఒకరకంగా నిర్మాతలు రిస్క్

 చేస్తున్నట్టే. కానీ, వారు ఎంచుకున్న కథపై నమ్మకంతోనే కిరణ్ పై అంత పెట్టడానికి సిద్దమయ్యారట. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట. త్వరలోనే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఇక ఈ న్యూస్ తెలిసి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం కి ఈ సినిమా అయినా మంచి కం బ్యాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>