Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle097e73b3-debe-43b2-8a7f-8cb1233d3464-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle097e73b3-debe-43b2-8a7f-8cb1233d3464-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. త్వరలో ‘లైలా’ అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్‌ మొదటిసారి అమ్మాయిగా నsocialstars lifestyle{#}ali;ghibran;prasad;ram narayan;Godavari River;Posters;Stree;Viswak sen;Mass;Adhurs;Valentines Day;Music;Girl;WOMEN;Cinema;Romanticలైలా గా మారిన మాస్ కా దాస్..!!లైలా గా మారిన మాస్ కా దాస్..!!socialstars lifestyle{#}ali;ghibran;prasad;ram narayan;Godavari River;Posters;Stree;Viswak sen;Mass;Adhurs;Valentines Day;Music;Girl;WOMEN;Cinema;RomanticWed, 03 Jul 2024 12:16:15 GMTటాలీవుడ్ లో వరుస హిట్‌లతో దూసుకుపోతున్న మాస్‌ కా దాస్ విశ్వక్‌ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. త్వరలో ‘లైలా’ అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్‌ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన రామ్ నారాయణ్ విశ్వక్సేన్‌ను లైలాగా మునుపెన్నడూ లేని పాత్రలో ప్రదర్శించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అటువంటి ధైర్యమైన, కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా, మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విశ్వక్‌ అమ్మాయిలా రెడీ అయ్యాడు.

ఈ ఫస్ట్ లుక్‌లో క్లోజ్‌గా కళ్లు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్‌ చేశారు. సినీ మేకర్స్ లైలా ఐ లుక్‌ని ఆవిష్కరించారు. లైలాగా విశ్వక్ సేన్ తన అందచందాలతో వచ్చారు. విశ్వక్‌సేన్‌కు ఇది అందమైన మేక్ఓవర్. విశ్వక్‌ సరిగ్గా అమ్మాయిలా కనిపించడం వల్ల లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే నటుడు కనిపించి ఉండరనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంతవరకు సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తేనే అర్థమవుతుంది. లైలా మనోహరమైన కాంతి అది స్త్రీ పాత్ర అని నమ్మేలా చేస్తుంది. లైలా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు.రిచర్డ్ ప్రసాద్ లెన్స్‌మెన్‌గా నటించిన ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి, గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్. బ్రహ్మ కడలి కళా దర్శకుడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ఫస్ట్ లుక్ కే ఈ విధమైన రెస్పాన్స్ వస్తుంటే.. ఇక ఈ సినిమ నుంచి రాబోయే అప్ డేట్స్ ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి లైలా సినిమా నుంచి రిలీజ్ అయినా విశ్వక్ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>