PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koliki-poodi-srivasarao-lokesh-tdpc52fb30e-a2e4-439c-8298-49be276573f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/koliki-poodi-srivasarao-lokesh-tdpc52fb30e-a2e4-439c-8298-49be276573f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అభివృద్ధి పైన దృష్టి కంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలను హింసించడం,భవనాలు కూల్చివేత పైన కూడా ఎక్కువగా టిడిపి నేతలు శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో కూల్చివేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తిరుపూర్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేస్తున్న వీరంగం పైన చాలామంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు.. కేవలం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడపకముందే టిడిపి ఎమ్మెల్యేలు తమ అసలు బుద్ధినిKOLIKI POODI SRIVASARAO;LOKESH;TDP{#}Scheduled caste;Lokesh;Lokesh Kanagaraj;MLA;Minister;Government;Andhra Pradesh;Party;YCP;TDP;CBN;Newsకూల్చివేతల కూటమి సర్కార్: పదవి కోసం అలాంటి పని చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే..?కూల్చివేతల కూటమి సర్కార్: పదవి కోసం అలాంటి పని చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే..?KOLIKI POODI SRIVASARAO;LOKESH;TDP{#}Scheduled caste;Lokesh;Lokesh Kanagaraj;MLA;Minister;Government;Andhra Pradesh;Party;YCP;TDP;CBN;NewsWed, 03 Jul 2024 08:30:00 GMTఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అభివృద్ధి పైన దృష్టి కంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలను హింసించడం,భవనాలు కూల్చివేత పైన కూడా ఎక్కువగా టిడిపి నేతలు శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో కూల్చివేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా తిరుపూర్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేస్తున్న వీరంగం పైన చాలామంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు.. కేవలం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడపకముందే టిడిపి ఎమ్మెల్యేలు తమ అసలు బుద్ధిని చూపిస్తున్నారనే విధంగా విమర్శలు వినిపిస్తున్నాయి.



 చాలామంది టీడీపీ పార్టీ నాయకులే వారిని విమర్శించేలా చేస్తూ ఉన్నారు. తిరుపూర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి టికెట్ సంపాదించుకున్న శ్రీనివాసరావు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా కేవలం మంత్రి పదవి పైన ఉన్నట్లుగా తెలుస్తోంది. నిత్యం ఆయన ఆలోచన కూడా అలాగే వ్యవహరించేలా కనిపిస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ను స్ఫూర్తిగా తీసుకొనే ఇలాంటి పనులు చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. తన ప్రత్యర్థి పార్టీ అయినా ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబానికి చెందినటువంటి భవనాన్ని ఆయన టార్గెట్ చేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


జెసిపి, బుల్లోజర్ తో స్వయంగా వెళ్లి జాతీయ రహదారి పైన ట్రాఫిక్కును సైతం సృష్టించేలా చేశారు. ముఖ్యంగా ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విధంగా ఆయన ఆలోచించకుండా అవన్నీ ఐదేళ్ల తర్వాత చూసుకుందాం అనే భావనతో ఈయన అనుచరులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కేవలం మంత్రి పదవిని దక్కించుకోవడం కోసమే చంద్రబాబు, లోకేష్ దృష్టిలో పడాలని అత్యుత్సాహంతో వైసిపి భవనాలను కూల్చే పనిలో పడ్డారు కొలికిపూడి శ్రీనివాసరావు. కేవలం లోకేష్, చంద్రబాబు దృష్టిలో పడాలని విధంగా ఇలా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పదవుల కోసం ఇంతగా దిగజారాలా అంటూ పలువురు నేతలు కూడా ఈయనను విమర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>