MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7c9d270-62ac-4036-8ae8-a7fd130d454c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7c9d270-62ac-4036-8ae8-a7fd130d454c-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమలహాసన్ తమిళ స్టార్ హీరో రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీళ్ళిద్దరూ ఎవరికివారు తమ సినిమాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. వీళ్ళిద్దరికీ తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు కుర్ర హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఇంత పెద్ద స్టార్ హీరోలు అయినప్పటికీ మంచి స్నేహితులు. ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పలు tollywood{#}bollywood;producer;Producer;K Balachander;Hero;Rajani kanth;Tamil;Cinemaరజనీకాంత్ తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కమలహాసన్..!?రజనీకాంత్ తో సినిమా చేయకపోవడానికి కారణం అదే.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కమలహాసన్..!?tollywood{#}bollywood;producer;Producer;K Balachander;Hero;Rajani kanth;Tamil;CinemaTue, 02 Jul 2024 17:40:00 GMTలోకనాయకుడు కమలహాసన్ తమిళ స్టార్ హీరో రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీళ్ళిద్దరూ ఎవరికివారు తమ సినిమాలతో చెరగని ముద్ర వేసుకున్నారు. వీళ్ళిద్దరికీ తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు కుర్ర హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఇంత పెద్ద స్టార్ హీరోలు అయినప్పటికీ మంచి స్నేహితులు. ఒకప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. దాదాపుగా 16 సినిమాల్లో కలిసి

 నటించారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించిన గెరాఫ్తార్ అనే సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కూడా నటించారు అలా అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమలహాసన్ రజినీకాంత్ తో తన స్నేహం గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ రజినీకాంత్ తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీరిద్దరు కలిసి భవిష్యత్తులో మళ్లీ నటిస్తారా ? అని అడగ్గా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు కమల్. “మా కాంబినేషన్ అనేది కొత్త కాదు. గతంలో మేమిద్దరం కలిసి చాలా లు చేశాం.

 కానీ కొన్నాళ్లకు మేము కలిసి పనిచేయకూడదని అనుకున్నాం. మా ఇద్దరి మధ్య పోటీతత్వమే ఉంది. కానీ అసూయ లేదు. మా ఇద్దరి దారులు విభిన్నంగా ఉంటాయి. మాకు నిర్మాత కె. బాలచందర్ గురువు. మా ఇద్దరి మార్గాలు వేరైన కేవలం పోటీతత్వమే ఉంటుంది. మేమేప్పుడు ఒకరిపై మరొకరం చులకన వ్యాఖ్యలు చేసుకోము. మేము సీనియర్స్ కాబట్టి ఇలా ఉంటున్నాం అనుకోవద్దు. కానీ 20 ఏళ్ల నుంచి మేం ఇలాగే ఉంటున్నాం. ఇప్పటికీ మా స్నేహం కొనసాగుతూనే ఉంది” అని అన్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>