MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-letest-movie-update-fresh-news524d326c-6a9a-4dd0-ad44-25ab8f14565f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-letest-movie-update-fresh-news524d326c-6a9a-4dd0-ad44-25ab8f14565f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను అనిల్ రావిపూడి చాలా రోజుల నుండి చేస్తూ వస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్ , మీనాక్షvenky{#}Wife;aishwarya rajesh;choudary actor;Traffic police;Audience;Posters;News;Hero;dil raju;Sri Venkateshwara Creations;anil ravipudi;Venkatesh;Pooja Hegde;Cinemaఅఫీషియల్ : వెంకీ నెక్స్ట్ లో ఆ ఇద్దరు బ్యూటీలు.. పోస్టర్ తోనే పాత్రలకి హింట్..?అఫీషియల్ : వెంకీ నెక్స్ట్ లో ఆ ఇద్దరు బ్యూటీలు.. పోస్టర్ తోనే పాత్రలకి హింట్..?venky{#}Wife;aishwarya rajesh;choudary actor;Traffic police;Audience;Posters;News;Hero;dil raju;Sri Venkateshwara Creations;anil ravipudi;Venkatesh;Pooja Hegde;CinemaTue, 02 Jul 2024 20:09:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను అనిల్ రావిపూడి చాలా రోజుల నుండి చేస్తూ వస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించబోతున్నట్లు అనేక రోజుల నుండి చాలా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై మూవీ బృందం ఏ మాత్రం స్పందించలేదు. దానితో ఇవన్నీ రూమర్స్ అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్లుగా ముద్దుగుమ్మల గురించి అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇక ఈ మూవీ యూనిట్ మధ్యాహ్నం విడుదల చేసిన పోస్టర్లో పైన ఎక్స్లెంట్ వైఫ్ .. ఎక్స్ కాఫ్ .. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని రాసుకొని వచ్చారు. 

ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లను బట్టి చూస్తే ఐశ్వర్య రాజేష్ ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని హోమ్లీ లుక్ లో ఉంది. ఇక మీనాక్షి చౌదరి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ టైట్ స్లీవ్ లెస్ టీ షర్టు ను వేసుకొని , ప్యాంటును ధరించి చేతిలో ఓ గన్ పట్టుకొని ఉంది. ఇక ఈ మూవీ బృందం మధ్యాహ్నం విడుదల చేసిన పోస్టర్ లో రాసుకున్న విధంగా చూసినట్లయితే ఎక్సలెంట్ వైఫ్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ , ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మీనాక్షి చౌదరి ,  ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్ ద్వారానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>