PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-rule-should-be-taken-as-a-lesson-by-babu6163a758-1c39-4854-bbc3-ce980ac47735-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-rule-should-be-taken-as-a-lesson-by-babu6163a758-1c39-4854-bbc3-ce980ac47735-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో పాటు జగన్ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. బాబును టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం వల్లే వైసీపీకి ఘోర ఫలితాలు వచ్చాయని చాలామంది ఫీలవుతారు. కూటమి మాత్రం ఏకంగా 164 స్థానాలతో ఏపీలో కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుని వార్ వన్ సైడ్ అని తేల్చి చెప్పింది. chandrababu{#}media;CBN;war;Jagan;YCPసీఎం చంద్రబాబు ఆ ఒక్క విషయంలో మారితే మంచిదా.. వాటిపై ఆంక్షలు సరికావంటూ?సీఎం చంద్రబాబు ఆ ఒక్క విషయంలో మారితే మంచిదా.. వాటిపై ఆంక్షలు సరికావంటూ?chandrababu{#}media;CBN;war;Jagan;YCPTue, 02 Jul 2024 17:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో పాటు జగన్ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. బాబును టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం వల్లే వైసీపీకి ఘోర ఫలితాలు వచ్చాయని చాలామంది ఫీలవుతారు. కూటమి మాత్రం ఏకంగా 164 స్థానాలతో ఏపీలో కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుని వార్ వన్ సైడ్ అని తేల్చి చెప్పింది.
 
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో నాలుగు న్యూస్ ఛానెళ్లపై ఆంక్షలు విధించడం గురించి ప్రముఖ జర్నలిస్ట్ హర్షవర్ధన్ త్రిపాఠి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని హర్షవర్ధన్ త్రిపాఠి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా గతంలో చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుందని ఆయన వెల్లడించారు.
 
అయితే వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడం, ఏపీలో కొన్ని న్యూస్ ఛానెళ్లపై ఆంక్షలు విధించడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో ఈ న్యూస్ ఛానెళ్లకు దాదాపుగా 60 లక్షల మంది వీక్షకులు ఉన్నారని భోగట్టా. సౌత్ స్టేట్స్ లో మాత్రమే మీడియాపై బ్యాన్ లాంటి పరిస్థితులు ఉన్నాయని హర్షవర్ధన్ త్రిపాఠి పేర్కొన్నారు. గతంలో జగన్ సైతం మీడియాపై ఆంక్షలు విధించి ఈ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయారని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అద్భుతంగా పాలనను సాగిస్తే మంచిదని చెప్పవచ్చు. మీడియాతో విబేధాలు పెట్టుకోకుండా బాబు ఏపీ ప్రజలు మేలు చేసేలా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటే బెనిఫిట్ కలుగుతుంది. మీడియా స్వేచ్చను హరిస్తే భవిష్యత్తులో బాబుకు ఇబ్బందులు ఎదురుకావచ్చని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ త్రిపాఠి సూచనలు కూడా ఒక విధంగా నిజమేనని న్యూట్రల్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మీడియా ఆంక్షల విషయంలో బాబులో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>