PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ycp-cbn-karyakarthalu-walenteers-7ba8d0df-f137-4ade-89d5-0bd3b1a13504-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ycp-cbn-karyakarthalu-walenteers-7ba8d0df-f137-4ade-89d5-0bd3b1a13504-415x250-IndiaHerald.jpg రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించింది. జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన ప్రజలకు తిరుగులేని పాలన అందిద్దాం అనుకున్నారు. జెండా మోసి, గ్రూపులు కట్టి, పార్టీకి నాయకులకు వారధులుగా ఉండేటువంటి కార్యకర్తలను పక్కన పెట్టేసాడు. వారి స్థానంలో వాలంటీర్లను తీసుకువచ్చి అద్భుతం చేద్దామనుకున్నాడు. కానీ అది బెడిసి కొట్టి జగనే అదృశ్యమయ్యాడు. మరి జగన్ ఈ పరిస్థితికి రావడానికి కారకులు ఎవరు.? అద్భుతమైన పాలన అందించిన ఆయనను ప్రజలు ఎంjagan;ycp;cbn;karyakarthalu;walenteers;{#}Delhi;TDP;Telangana Chief Minister;Congress;Reddy;Party;Hanu Raghavapudi;Government;Jagan;YCPకర్రు కాల్చి వాత పెట్టిన వాలంటీర్లు..కార్యకర్తలను నమ్ముంటే సీఎం అయ్యేవాడు.!కర్రు కాల్చి వాత పెట్టిన వాలంటీర్లు..కార్యకర్తలను నమ్ముంటే సీఎం అయ్యేవాడు.!jagan;ycp;cbn;karyakarthalu;walenteers;{#}Delhi;TDP;Telangana Chief Minister;Congress;Reddy;Party;Hanu Raghavapudi;Government;Jagan;YCPTue, 02 Jul 2024 06:39:20 GMT- వైసిపి వారధులు వాలంటీర్లు

- జెండా మోసిన కార్యకర్తలు హర్టయ్యారు.

- వైసీపీని పాతాళానికి తొక్కేశారు.

 రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించింది. జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన ప్రజలకు తిరుగులేని పాలన అందిద్దాం అనుకున్నారు. జెండా మోసి, గ్రూపులు కట్టి,  పార్టీకి నాయకులకు వారధులుగా ఉండేటువంటి కార్యకర్తలను పక్కన పెట్టేసాడు. వారి స్థానంలో వాలంటీర్లను తీసుకువచ్చి అద్భుతం చేద్దామనుకున్నాడు. కానీ అది బెడిసి కొట్టి జగనే అదృశ్యమయ్యాడు. మరి జగన్ ఈ పరిస్థితికి రావడానికి కారకులు ఎవరు.? అద్భుతమైన పాలన అందించిన ఆయనను ప్రజలు ఎందుకు ఆదరించలేదు.? అసలు వాలంటీర్ల వల్ల వచ్చిన సమస్య ఏంటి.? కార్యకర్తలు ఎందుకు హర్ట్ అయ్యారు అనే వివరాలు చూద్దాం..

 గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రాజకీయ పార్టీ చూసిన  దానికి ప్రధాన బలం కార్యకర్త. ఈ వ్యక్తులు లేకపోతే పార్టీ ఉండదు, నాయకులు ఉండరు, పదవులు ఉండవు. అసలు రాజకీయ వ్యవస్థ ఉండదు. అలాంటి పార్టీలకు ప్రధాన పిల్లర్ గా ఉండేటువంటి కార్యకర్తలను  హక్కున చేర్చుకొని చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుల పైనే ఉంటుంది. కార్యకర్త బాగుంటేనే పార్టీ చేసిన పనులను, పథకాలను ప్రజలకు చేరవేసి  పార్టీకి నాయకులకు వారధిగా ఉంటారు. కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ వారధిని కూల్చివేసి, వాలంటీర్లకు మరియు ప్రజలకు మధ్య మరో వారధి కట్టారు. చివరకు కార్యకర్తలు పార్టీ చేసే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాలేకపోయారు. కనీసం వారి నాయకుడు ఎవరో చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయింది.  ఇక వాలంటీర్లు అయితే ప్రభుత్వ సర్వెంట్లుగానే పనిచేశారు, తప్ప ఒక పార్టీకి ఏ మాత్రం పని చేయలేదు.  ఇక ప్రజలు ఏ సమస్య వచ్చినా వాలంటీర్ల దగ్గరికి మాత్రమే వెళ్లారు.

దీంతో రాష్ట్రంలో వైసిపి  కార్యకర్తలు  ప్రజల్లో చాలా మైనస్ అయ్యారు. కానీ వాలంటీర్లు మాత్రం వచ్చిన పథకాలను ప్రజలకు అందించడం, అందిన కాడికి దోచుకోవడం వంటి కార్యక్రమాలు దండిగా చేశారు. ఇదే అదునుగా తీసుకున్నటువంటి టిడిపి కార్యకర్తలు ప్రజలకు దగ్గరయ్యారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిందించారు. చాప కింద నీరులా, వైసీపీకి  ఎదురుదెబ్బలా మారారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం  నేను ఇచ్చిన పథకాలే నన్ను గెలిపిస్తాయి.  నేను ప్రజలకు ఎన్నో చేశాను అనే అపోహకు వెళ్లి, కనీసం కార్యకర్తలకు ఎలాంటి సహాయ, సహకారాలు కూడా అందించలేదు.  దీంతో ఐదు సంవత్సరాలు అల్లాడిపోయిన కార్యకర్త, ఎన్నికల సమయం నాటికి ప్రజల్లోకి వెళితే  కొత్త వ్యక్తుల్లా కనిపించారు. ఓట్లు రాబట్ట లేకపోయారు. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో బాణం వేద్దామంటే అది రివర్స్ అయి ఆయనకే తగిలింది. తగలడం కాదు వైసిపి పార్టీని తగలబెట్టే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిందని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>