MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh0d9e9e2b-7811-46f9-b359-1886d8828e9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh0d9e9e2b-7811-46f9-b359-1886d8828e9c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇక మహేష్ బాబు తన కెరీర్లో తనకు మొదటి సారి విజయం ఇచ్చిన దర్శకులను నమ్మి రెండవ , మూడవ అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలా మహేష్ నమ్మి వారికి అవకాశం ఇచ్చిన కొంత మంది దర్శకులు మాత్రం దానిని నిలబెట్టుకోలేక పోయారు. అలా మహేష్ కి మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇచ్చి , ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందించలేకపోయిన దర్శకులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ ప్రారంభంలో గుణశేఖర్ దర్శmahesh{#}gunasekhar;srikanth addala;srinu vytla;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;Okkadu;Aagadu;mahesh babu;Dookudu;Blockbuster hit;Hero;Box office;Darsakudu;Director;Arjun;Yevaru;Cinema;Successమహేష్ నమ్మకాన్ని వొమ్ము చేసిన దర్శకులు వీరే..?మహేష్ నమ్మకాన్ని వొమ్ము చేసిన దర్శకులు వీరే..?mahesh{#}gunasekhar;srikanth addala;srinu vytla;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;Okkadu;Aagadu;mahesh babu;Dookudu;Blockbuster hit;Hero;Box office;Darsakudu;Director;Arjun;Yevaru;Cinema;SuccessTue, 02 Jul 2024 11:23:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఇక మహేష్ బాబు తన కెరీర్లో తనకు మొదటి సారి విజయం ఇచ్చిన దర్శకులను నమ్మి రెండవ , మూడవ అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలా మహేష్ నమ్మి వారికి అవకాశం ఇచ్చిన కొంత మంది దర్శకులు మాత్రం దానిని నిలబెట్టుకోలేక పోయారు. అలా మహేష్ కి మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇచ్చి , ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందించలేకపోయిన దర్శకులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరియర్ ప్రారంభంలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మహేష్ బాబుకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఈ దర్శకుడితో అర్జున్ అనే మూవీ ని చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ దర్శకుడికి మహేష్ మరో అవకాశం ఇచ్చాడు. ఆయన మహేష్ తో సైనికుడు అనే మూవీ ని రూపొందించాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇక మహేష్ బాబు కొంత కాలం క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తర్వాత మహేష్ ఈ దర్శకుడిని నమ్మి మరో అవకాశం ఇచ్చాడు. దానితో శ్రీను వైట్ల , మహేష్ తో ఆగడు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల మొదటగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు మహేష్ తో బ్రహ్మోత్సవం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>