PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramachandraiah-hariprasad-pawan-and-babu-both-made-a-mistake2e0155ea-025e-422a-ae12-53f4c103c4c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramachandraiah-hariprasad-pawan-and-babu-both-made-a-mistake2e0155ea-025e-422a-ae12-53f4c103c4c5-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ఏపీలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా ఎమ్మెల్సీలు సీ. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ పదవులపై అనర్హత వేటు పడడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు పదవులు ఎమ్మెల్యే కోటాలో జరుగుతూ ఉండడంతో.. రెండు కూటమి ఖాతాలోనే పడనున్నాయి. పార్టీ మారి వచ్చినా కూడా సీనియర్ నేత రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; chandrababu; tdp; jenasena{#}Telugu Desam Party;MLA;Government;CBN;Elections;YCP;Party;Janasena;kalyan;TDPరామ‌చంద్ర‌య్య, హ‌రిప్ర‌సాద్‌.. ప‌వ‌న్, బాబు ఇద్ద‌రు మిస్టేక్ చేశారా..రామ‌చంద్ర‌య్య, హ‌రిప్ర‌సాద్‌.. ప‌వ‌న్, బాబు ఇద్ద‌రు మిస్టేక్ చేశారా..AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; chandrababu; tdp; jenasena{#}Telugu Desam Party;MLA;Government;CBN;Elections;YCP;Party;Janasena;kalyan;TDPTue, 02 Jul 2024 10:37:30 GMTఏపీలో కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ఏపీలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా ఎమ్మెల్సీలు సీ. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ పదవులపై అనర్హత వేటు పడడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు పదవులు ఎమ్మెల్యే కోటాలో జరుగుతూ ఉండడంతో.. రెండు కూటమి ఖాతాలోనే పడనున్నాయి. పార్టీ మారి వచ్చినా కూడా సీనియర్ నేత రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు.


ఆ మాటకు వస్తే ఆయన గతంలో టీడీపీ వాడే టీడీపీ తోనే రామచంద్రయ్య రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇక మహమ్మద్ ఇక్బాల్ మైనార్టీ నేత ఆయన తన ఎమ్మెల్సీ పదవి వదులుకొని టీడీపీలోకి వచ్చిన ఆయనకు మరోసారి పదవి ఇవ్వలేదు. అనూహ్యంగా రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు జనసేనకు కేటాయించారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడే చంద్రబాబు, పవన్ ఇద్దరు తప్పు చేశారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాలు జరుగుతున్నాయి.


అటు సీ. రామచంద్రయ్య , ఇటు హరిప్రసాద్ ఇద్దరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావటం.. ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అసంతృప్తి కారణం అవుతుంది. ఒకటి కాపులకు ఇచ్చినప్పుడు.. రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని కనీసం బీసీలలో ఎవరికి అయిన ఇచ్చి ఉంటే బాగుండేదంటున్నారు. అనూహ్యంగా ఇటు చంద్రబాబు, అటు పవన్ ఇద్దరు కూడా తమ పార్టీల నుంచి కాపు సామాజిక‌ వర్గానికి చెందిన నేతలనే ఎమ్మెల్సీలుగా ఎంపిక‌ చేశారని.. ఇది ఎంతవరకు కరెక్ట్ ? అన్న చర్చలు రెండు పార్టీల నేతలలోనూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పైకి ఎవరూ చెప్పకపోయినా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>