MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kanguva0b7ecdec-4dab-4313-9a73-92998c3b90ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-kanguva0b7ecdec-4dab-4313-9a73-92998c3b90ce-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కంగువ' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా తమిళ మాస్ దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్ట పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ మాస్ మసాలా రొటీన్ సినిమాలు మాత్రమే ఎక్కువగా తీస్తారు. చాలా రొటీన్ గా ఆయన సినిమ#kanguva{#}UV Creations;Shiva;lord siva;Bobby Deol;Dussehra;Vijayadashami;Darsakudu;INTERNATIONAL;October;Mass;Director;Tamil;BEAUTY;Heroine;Hero;bollywood;Cinema;Indiaకంగువ పర్ఫెక్షన్ కోసం కాయకష్టం పడుతున్న డైరెక్టర్?కంగువ పర్ఫెక్షన్ కోసం కాయకష్టం పడుతున్న డైరెక్టర్?#kanguva{#}UV Creations;Shiva;lord siva;Bobby Deol;Dussehra;Vijayadashami;Darsakudu;INTERNATIONAL;October;Mass;Director;Tamil;BEAUTY;Heroine;Hero;bollywood;Cinema;IndiaTue, 02 Jul 2024 12:48:03 GMTతమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కంగువ' రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా  తమిళ మాస్ దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్ట పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ మాస్ మసాలా రొటీన్ సినిమాలు మాత్రమే ఎక్కువగా తీస్తారు. చాలా రొటీన్ గా ఆయన సినిమాలు ఉంటాయి. వివేగం సినిమాతో కొత్తగా ట్రై చేశాడు గాని ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దాంతో మళ్ళీ రొటీన్ సినిమాలు మొదలు పెట్టారు. వివేగం సినిమా తరువాత విశ్వాసం, అన్నాతే వంటి మాస్ రొటీన్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలు హిట్ అయినా కానీ రొటీన్ గా ఉండటం తో శివ అనేక విమర్శలు ఎదురుకున్నాడు. 

దాంతో ఒక డిఫరెంట్ స్టోరీ చేసి పెద్ద పాన్ ఇండియా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి సూర్యతో కంగువ లాంటి భారీ బడ్జెట్ సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా రావడానికి శివ ఎంతో కష్టపడి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా ఇంత లేట్ అవుతుంది. ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా  బాలీవుడ్ సీనియర్ హీరో రీసెంట్ గా యానిమల్ మూవీతో లైట్ లోకి వచ్చిన బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ 'కంగువ' సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది ఈ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>