MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8067b7c6-b65f-412c-ab2d-bcbee43e73dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8067b7c6-b65f-412c-ab2d-bcbee43e73dc-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా 28 సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ బ్యానర్స్ పై ఉదయినిది స్టాలిన్ సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ tollywood{#}lyca productions;udhayanidhi stalin;Stalin;Bharateeyudu;Director;News;media;shankar;Tamil;India;Cinema;Hindiభారతీయుడు 2 గురించి సంచలన విషయాలు బయటపెట్టిన శంకర్..!?భారతీయుడు 2 గురించి సంచలన విషయాలు బయటపెట్టిన శంకర్..!?tollywood{#}lyca productions;udhayanidhi stalin;Stalin;Bharateeyudu;Director;News;media;shankar;Tamil;India;Cinema;HindiTue, 02 Jul 2024 09:30:00 GMTతమిళ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా 28 సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా రాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ బ్యానర్స్ పై ఉదయినిది స్టాలిన్ సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా

 తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో జులై 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .అయితే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టారు చిత్రబృందం. ఇదిలవుండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శంకర్ భారతీయుడు సీక్వెల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అన్న దానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన పలు కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ మాట్లాడుతూ… ‘భారతీయుడు తర్వాత వేరే సినిమాలతో బిజీ అయ్యా. పత్రికల్లో, టీవీల్లో లంచం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ భారతీయుడు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అయితే చెప్పాలనుకున్న విషయాన్ని భారతీయుడులోనే చెప్పేశాం కదా.. సీక్వెల్‌ అవసరమా అనుకున్నా. ఆ ఆలోచనతోనే సంవత్సరాలు గడిచాయి. అవినీతి ఇంకా అలానే ఉందని న్యూస్‌ పేపర్లు, టీవీలు మళ్లీ గుర్తుచేశాయి. భారతీయుడు 2 తీయాలని నిర్ణయించుకున్నా. రోబో 2 పూర్తయిన తర్వాత భారతీయుడు 2 స్క్రిప్టు సిద్ధం చేశా. 2019లో సినిమాని ప్రారంభించాం. సీక్వెల్‌ తెరకెక్కించడం పెద్ద సవాలు. తొలి భాగం నేపథ్యమేంటో, పాత్రల తీరు ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి రెండో భాగం అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడ్డాను. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే పార్ట్ 2 ఉంటుంది’ అని చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>