Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/block-buster-director-tho-nandamuri-varasudi-cinima0f0fc498-6f4b-4808-9e10-93b85a85b1ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/block-buster-director-tho-nandamuri-varasudi-cinima0f0fc498-6f4b-4808-9e10-93b85a85b1ed-415x250-IndiaHerald.jpgనందమూరి వంశం నుంచి మరో వారసుడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. నట సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హనుమాన్‌ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్socialstars lifestyle{#}prasanth varma;teja;Satyanand;prasanth;Viswak sen;simhaa;Prashant Kishor;Ram Gopal Varma;boyapati srinu;media;Event;Varasudu;social media;Balakrishna;News;Cinema;Indiaబ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో నందమూరి వారసుడి సినిమా..?బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో నందమూరి వారసుడి సినిమా..?socialstars lifestyle{#}prasanth varma;teja;Satyanand;prasanth;Viswak sen;simhaa;Prashant Kishor;Ram Gopal Varma;boyapati srinu;media;Event;Varasudu;social media;Balakrishna;News;Cinema;IndiaTue, 02 Jul 2024 15:07:30 GMTనందమూరి వంశం నుంచి మరో వారసుడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. నట సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హనుమాన్‌ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ కూడా పలుమార్లు త్వరలో వస్తాడని చెప్తూనే ఉన్నాడు. ఇక మోక్షజ్ఞ ఎక్కడ కనిపించినా అతని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతాయి. ఇటీవల విశ్వక్ సేన్ సినిమా ఈవెంట్ కి బాలకృష్ణ వస్తే అక్కడ కూడా మోక్షజ్ఞ త్వరలో వస్తున్నాడు అని చెప్పాడు. విశ్వక్ అయితే మోక్షజ్ఞ సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని తెలిపాడు.తాజాగా మోక్షజ్ఞ త్వరలో వస్తున్నట్టు ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్‌ మీడియా  లో మోక్షజ్ఞ ఫ్యాన్ పేజీ ఒకటి మోక్షజ్ఞ, బాలకృష్ణ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ పేజీలో మోక్షజ్ఞ కొత్త లుక్ ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి వస్తున్నా.. అంటూ పోస్ట్ చేసారు. 

అయితే ఈ ఫోటోలో చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు ఆ ఫోటో సైడ్ వ్యూలో ఉండటంతో మోక్షజ్ఞ పోలికలు కనిపించట్లేదు, అసలు ఇతను మోక్షజ్ఞనేనా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది.ఇక మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలయ్య బాబుని ప్రశాంత్ వర్మ అన్‌స్టాపబుల్ షో కోసం డైరెక్ట్ చేసాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు రాబోతున్నాయి. దీంతో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ద్వారా అయితే సేఫ్ గా ల్యాండ్ అవుతాడని బాలయ్య ఆలోచించినట్టు తెలుస్తుంది. చూడాలి మరి మోక్షజ్ఞ ఎంట్రీ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో.అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. యువకుడు ఎక్కువ అడగలేడు. బోయపాటి శ్రీను లాంటి సీనియర్‌ కంటే వర్మ లాంటి యువకుడి డైరెక్షన్‌లో సినిమా చేయడం బెటర్‌.సంవత్సరాలు వృధా చేసుకోకుండా తన కొడుకు నటనకు అరంగేట్రం చేసే సమయం ఆసన్నమైందని బాలయ్య భావిస్తున్నాడు. 'అఖండ' నటుడు రాజకీయంగా క్రమబద్ధీకరించబడ్డాడు, ఎన్నికల ముందు హ్యాట్రిక్ సాధించాడు. అతను ఈ మధ్యన మోస్ఖగ్నాని సిద్ధం చేస్తున్నాడు.ఇటీవల నటుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. వైజాగ్‌లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్‌లో మోక్షు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. అతను తన నటనా రంగ ప్రవేశం చేయబోతున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>