PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-whisky-war-ycp-kutamia30cd0e5-6f7c-4ac7-a1fe-26cb9cf4a60e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-whisky-war-ycp-kutamia30cd0e5-6f7c-4ac7-a1fe-26cb9cf4a60e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో గతంలో వైసిపి పార్టీ ఉన్నప్పుడు జనసేన టిడిపి బిజెపి నేతలు సైతం మద్యం విషయం పైన చాలా దారుణంగా ట్రోల్ చేశారు.. ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన మందు తక్కువ ధరకే అందిస్తామని కూడా తెలియజేశారు. అందులో భాగంగా కొన్ని బ్రాండ్లను తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక బ్రాండ్ అటు కూటమిని ట్రోల్ చేసేలా కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 999 పవర్ స్టార్ సుపీరియర్ అనే పేరుతో కొత్త విస్కీ వైరల్ గా మారుతున్నది. దీని పైన వైసీపీ పార్టీ స్పందిస్తూ కూటమి ప్రభుత్వంWHISKY;WAR;YCP;KUTAMI{#}Pawan Kalyan;war;Bharatiya Janata Party;TDP;YCP;Government;Janasenaఏపీ: వైసిపి,కూటమి మధ్య.. పవర్ స్టార్ విస్కీ వార్..!ఏపీ: వైసిపి,కూటమి మధ్య.. పవర్ స్టార్ విస్కీ వార్..!WHISKY;WAR;YCP;KUTAMI{#}Pawan Kalyan;war;Bharatiya Janata Party;TDP;YCP;Government;JanasenaTue, 02 Jul 2024 20:05:41 GMTఆంధ్రప్రదేశ్లో గతంలో వైసిపి పార్టీ ఉన్నప్పుడు జనసేన టిడిపి బిజెపి నేతలు సైతం మద్యం  విషయం పైన చాలా దారుణంగా ట్రోల్ చేశారు.. ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన మందు తక్కువ ధరకే అందిస్తామని కూడా తెలియజేశారు. అందులో భాగంగా కొన్ని బ్రాండ్లను తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక బ్రాండ్ అటు కూటమిని ట్రోల్ చేసేలా కనిపిస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో 999 పవర్ స్టార్ సుపీరియర్ అనే పేరుతో కొత్త విస్కీ వైరల్ గా మారుతున్నది. దీని పైన వైసీపీ పార్టీ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ అనే పేరుతో ఒక కొత్త బ్రాండ్ ను సైతం తీసుకువచ్చింది అంటూ విమర్శించారు. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్ ఉందంటూ ఆరోపించారు. ఇందుకు టిడిపి జనసేన స్పందించి వైసిపి పార్టీకి కాస్త దీపిగానే కౌంటర్లు వేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ ప్రెసిడెంట్ మోడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ తదితర బ్రాండ్లను తీసుకువచ్చిన ఘనత వైసిపి పార్టీ దే అంటూ కౌంటర్లు వేస్తున్నారు.


ముఖ్యంగా ఐదేళ్లలో మద్యంతో ఎంతోమంది ప్రాణాలను సైతం వైసీపీ పార్టీ తీసింది అని ఆ బ్రాండ్లతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన బ్రాండ్లు కాస్త బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అటు కూటమికి వైసిపి పార్టీకి మధ్య పవర్ స్టార్ విస్కీ వార్ అనేది చాలా వైరల్ గా మారుతోంది.. మరి రాబోయే రోజుల్లో మద్యం విషయంలో మరిన్ని ట్రోల్స్ వినిపిస్తాయో అంటూ పలువురు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు రకాల నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు.. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా అమలు చేసే విధంగానే పలు రకాల ప్రణాళికలు చేస్తూ వెళ్తున్నారు.. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలానే ఉన్నాయి కూటమి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>