MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr587154e2-28d5-4ad8-a58b-58af1350e435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr587154e2-28d5-4ad8-a58b-58af1350e435-415x250-IndiaHerald.jpgJr NTR ప్రస్తుత సినిమాల షూటింగ్ అప్డేట్స్? టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివతో చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ నుంచి వస్తున్న సినిమా పైగా కొరటాలకు ఇది ప్రెస్ట్రీజీయస్ ప్రాజెక్ట్. అందుకే.. దేవర మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.దసరాకు రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీకి ప్రీపోన్ అయింది. కల్కి సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి Jr NTR{#}war;prashanth neel;Prasanth Neel;Tollywood;NTR;Hero;koratala siva;India;bollywood;News;vijay kumar naidu;CinemaJr NTR ప్రస్తుత సినిమాల షూటింగ్ అప్డేట్స్?Jr NTR ప్రస్తుత సినిమాల షూటింగ్ అప్డేట్స్?Jr NTR{#}war;prashanth neel;Prasanth Neel;Tollywood;NTR;Hero;koratala siva;India;bollywood;News;vijay kumar naidu;CinemaTue, 02 Jul 2024 12:16:00 GMTJr ntr ప్రస్తుత సినిమాల షూటింగ్ అప్డేట్స్? 

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివతో చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ నుంచి వస్తున్న సినిమా పైగా కొరటాలకు ఇది ప్రెస్ట్రీజీయస్ ప్రాజెక్ట్. అందుకే.. దేవర మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.దసరాకు రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీకి ప్రీపోన్ అయింది. కల్కి సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం దేవర 1కి సంబంధించిన కీలక షెడ్యూల్‌ కూడా జరుగుతోంది. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, ప్రకాష్ రాజ్‌, షైన్‌ టామ్‌ ఇంకా అలాగే శ్రీకాంత్‌తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది.


ఇక ఈ షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లపై ఫారిన్‌లో ఓ పాట షూటింగ్‌ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడితో దేవర పార్ట్‌ 1 మూవీ షూటింగ్‌ కంప్లీట్ కానుందని సమాచారం తెలుస్తుంది. జులై నెలలో ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ.. ఆగస్టు నెలలో మొదటి లేదా రెండో వారానికి దేవర షూటింగ్‌ పూర్తి కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమా అయిపోగానే.. వెంటనే వార్ 2 మూవీలో జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి కీలక షెడ్యూల్ పూర్తి చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ కి తొలి బాలీవుడ్ మూవీ కావడంతో చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. ఈ లోపు ప్రశాంత్ నీల్ 'సలార్ 2' సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలా ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>