PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunaidu818c4664-b69d-4f3f-8aa7-557872e6c231-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunaidu818c4664-b69d-4f3f-8aa7-557872e6c231-415x250-IndiaHerald.jpgకూటమి గెలిచి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం.. హామీలు.. టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అందుకే ఈసారి జనాలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. అధికారాన్ని నిలబెట్టుకుంటూనే హామీలను అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.గెలిచాం.. ఇక తిరుగులేదు.హాయిగా రిలాక్స్ అవుదాం అని కూర్చోకుండా 70 ఏళ్ల వయసులో కూడా సీఎం గా ఎంతో ఉత్సాహంగా తన పనిని త్వరగా మొదలు పెట్టారు.గతంలో కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించినchandrababunaidu{#}Amaravati;Cabinet;CM;TDP;CBN;Andhra Pradesh;Indiaమెగా డిఎస్సీ: బాబు హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఊరట?మెగా డిఎస్సీ: బాబు హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఊరట?chandrababunaidu{#}Amaravati;Cabinet;CM;TDP;CBN;Andhra Pradesh;IndiaTue, 02 Jul 2024 22:29:06 GMT* ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి అవకాశంలా తీసుకున్న చంద్రబాబు!
* ఇచ్చిన హామీలపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు!
* నిరుద్యోగులకు మెగా డిఎస్సీ ఊరటనిచ్చి మెప్పు పొందుతున్న చంద్రబాబు!

( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) : కూటమి గెలిచి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం.. హామీలు.. టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అందుకే ఈసారి జనాలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. అధికారాన్ని నిలబెట్టుకుంటూనే హామీలను అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.గెలిచాం.. ఇక తిరుగులేదు.హాయిగా రిలాక్స్ అవుదాం అని కూర్చోకుండా 70 ఏళ్ల వయసులో కూడా సీఎం గా ఎంతో ఉత్సాహంగా తన పనిని త్వరగా మొదలు పెట్టారు.గతంలో కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు..ఈ సారి వచ్చిన అధికారాన్ని మాత్రం ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. అధికారం వచ్చింది.. గడిచిపోతుంది అన్నట్లుగా కాకుండా ఓపికతో, పట్టుదలతో పనిచేస్తున్నారు.

చంద్రబాబు తనకు ఈ సారి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పెద్ద బాధ్యతగా తీసుకొని సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చెప్పినట్లుగా అమలు చేసేందుకు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ముందుగా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న నిరుద్యోగ సమస్య పై దృష్టి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల రూపంలో ఊరటనిచ్చారు.నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ విడుదల చేసి ప్రజల మెప్పు పొందుతున్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీ చేశారు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయగా..మరో వారం రోజుల్లో మెగా డీఎస్సీకి ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్ కి డీఎస్సీకి మధ్య 30 రోజులకి పైగా వ్యవధి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల గురించి ఆలోచించి చాలా వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసనీయం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>