MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-is-a-record-holder-in-politics-too0a5c0cdf-b002-4993-a39c-fac9831fc94a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-is-a-record-holder-in-politics-too0a5c0cdf-b002-4993-a39c-fac9831fc94a-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను తెలుగు సినీ నటుడుగానే కాకుండా... నిర్మాతగా, శాసనసభ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలకృష్ణ వైవిద్యభరితమైన పాత్రలను పోషించడమే కాకుండా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతిచిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. balayya{#}Balakrishna;boyapati srinu;Hindupuram;Telugu Desam Party;Kesari;Mythri Movie Makers;producer;Producer;Telugu;Cinema;Newsబాలయ్య: హైట్రిక్‌ ఎమ్మెల్యే రేటు చూసి వణికిపోతున్న నిర్మాతలు ?బాలయ్య: హైట్రిక్‌ ఎమ్మెల్యే రేటు చూసి వణికిపోతున్న నిర్మాతలు ?balayya{#}Balakrishna;boyapati srinu;Hindupuram;Telugu Desam Party;Kesari;Mythri Movie Makers;producer;Producer;Telugu;Cinema;NewsMon, 01 Jul 2024 16:33:00 GMTనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను తెలుగు సినీ నటుడుగానే కాకుండా... నిర్మాతగా, శాసనసభ సభ్యుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలకృష్ణ వైవిద్యభరితమైన పాత్రలను పోషించడమే కాకుండా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతిచిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

తన సినిమాలు, డైలాగ్స్ ఎంతో ఫేమస్ అవుతూ ఉంటాయి. బాలకృష్ణ ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే....మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏకంగా మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు బాలయ్య. ఇదిలా ఉండగా.... బాలకృష్ణ ఎప్పటికప్పుడు సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటారు.


అంతేకాకుండా బాలకృష్ణ తెలుగు సీనియర్ హీరోలందరిలో పారితోషికం పరంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా పారితోషికాన్ని తీసుకుంటాడు.  అటువంటి బాలకృష్ణ వీర సింహరెడ్డి సినిమా చేసినందుకుగాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఏకంగా రూ. 14 కోట్లు పారితోషికాన్ని అందించారు. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాలో నటించినందుకు రూ. 18 కోట్లు పారితోషికాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ బాబీ సినిమా చేసినందుకు గాను బాలయ్య బాబుకి ఏకంగా రూ. 30 కోట్ల వరకు పారితోషికాన్ని నిర్మాత బలవంతంగా ఇచ్చారట.


ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే బోయపాటి సినిమాకు నిర్మాతలు రూ. 34 కోట్ల వరకు పారితోషికాన్ని ఇస్తున్నారని సమాచారం.  ఇక ఈ సినిమాకు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారట. బోయపాటితో సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ చేయబోయే తదుపరి సినిమాకు పూర్తి నిర్మాతగా తేజస్విని ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ పారితోషికం భారీగానే పెరుగుతుందని పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>