MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగతవారం విడుదలైన ‘కల్కి 2898’ మూవీ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ కీర్తిని పెంచే సినిమాగా దేశవ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీతో దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు ఫిలిమ్ ఇండస్ట్రీ జీనియస్ గా మారుమ్రోగిపోతోంది. ఈ మూవీలో ప్రధాన పాత్రలతో పాటు ఎన్ని పాత్రలు ఉన్నాయో లెక్కపెట్టడం కూడ చాల కష్టం. విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ అనుదీప్ కేవీ ఇలా చాలామంది ఈమూవీలో అతిధి పాత్రలలో కనిపించారు. వీరితో పాటు కొంతమంది ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించినప్పటికీ కొన్నిPRABHAS{#}Athidhi;Rajamouli;vijay deverakonda;Ram Gopal Varma;deepika;nag ashwin;Prabhas;Darsakudu;Director;bollywood;Salman Khan;Romantic;Audience;Industry;Cinema;Newsఆమెను నిరాశ పరిచిన కల్కి !ఆమెను నిరాశ పరిచిన కల్కి !PRABHAS{#}Athidhi;Rajamouli;vijay deverakonda;Ram Gopal Varma;deepika;nag ashwin;Prabhas;Darsakudu;Director;bollywood;Salman Khan;Romantic;Audience;Industry;Cinema;NewsMon, 01 Jul 2024 09:00:00 GMTగతవారం విడుదలైన ‘కల్కి 2898’ మూవీ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ కీర్తిని పెంచే సినిమాగా దేశవ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీతో దర్శకుడు నాగ్ అశ్విన్ పేరు ఫిలిమ్ ఇండస్ట్రీ జీనియస్ గా మారుమ్రోగిపోతోంది. ఈ మూవీలో ప్రధాన పాత్రలతో పాటు ఎన్ని పాత్రలు ఉన్నాయో లెక్కపెట్టడం కూడ చాల కష్టం.



విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ అనుదీప్ కేవీ ఇలా చాలామంది ఈమూవీలో అతిధి పాత్రలలో కనిపించారు. వీరితో పాటు కొంతమంది ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించినప్పటికీ కొన్ని పాత్రలకు మాత్రమే ప్రేక్షకుల నుండి స్పందన వస్తోంది. వీరిలో రాక్సీ పాత్ర చేసిన బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని కి ఈమూవీ కనీసపు గుర్తింపును కూడ తీసుకురాలేక పోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.



ఈమూవీలో ప్రభాస్ నటించిన భైరవ పాత్రను పోషించే పాత్రలో దిశ పఠాని కనిపించింది. అయితే ఈసినిమా అయిపోయిన తరువాత బయటకు వచ్చిన ప్రేక్షకులు ఆమె గురించి ఏమాత్రం మాట్లాడుకోవడం లేదు. ప్రభాస్ దిశ పఠానీల మధ్య రొమాన్స్ వర్కవుట్ చేయడానికి వారిద్దరి మధ్య ఒక పాటను నాగ్ అశ్విన్ పెట్టినప్పటికీ ఆ పాట ట్యూన్ ఏమాత్రం బాగుండక పోవడంతో సగటు ప్రేక్షకులు దిశ పాత్రను పట్టించుకోవడంలేదు అన్నకామెంట్స్ వస్తున్నాయి.



రొమాంటిక్ సాంగ్ అవ్వగానే దిశ పాత్ర అంతర్ధానం అయిపోతుంది. తర్వాత ఆమె ఎక్కడా కనిపించదు. దీనితో అందరు ఆపాత్రను మర్చిపోయి ఉంటారు అన్న అంచనాలు కూడ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈమూవీలో నటించిన దీపిక పదుకొనె అమితా బచ్చన్ ల నటన ముందు ప్రభాస్‌ నటన విషయంలో అంతగా రాణించలేకపోయాడు అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి. ప్రభాస్ నటన పై ఎలాంటి కామెంట్స్ ఉన్నప్పటికీ 150 కోట్ల పారితోషికం ఈ మూవీకి ప్రభాస్ తీసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ప్రభాస్ మ్యానియాకు షాక్ అవుతున్నాయి..









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>