PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hema-malini-politics-bjp7f0e2648-493e-4cad-83dd-15609cc33e8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hema-malini-politics-bjp7f0e2648-493e-4cad-83dd-15609cc33e8f-415x250-IndiaHerald.jpg•డ్రీమ్ గర్ల్ గా కెరియర్ ప్రయాణం.. * రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయ అరంగేట్రం.. •ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే నైపుణ్యం (ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్) రాజకీయాలలోకి మహిళలు కూడా అడుగుపెడుతూ సత్తా చాటుతూ ఉండగా.. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోయిన్లు కూడా మొదట ఒక పార్టీకి సంబంధించి ప్రచారాలను కొనసాగిస్తూ.. ఆ తర్వాత నేరుగా రాజకీయాలలోకి అడుగుపెట్టి.. పలు స్థానాలలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొంది ప్రజల మన్ననలు సొంతం చేసుకున్నారు. ఇక చాలామంది హీరోయిన్స్ తమ అందంతోనే కాదు రాజకీయాలలో HEMA MALINI;POLITICS;BJP{#}madhura sridhar reddy;Sangeetha;Dream Girl;Padma Shri;tara;Rajya Sabha;Culture;October;Hero;Chitram;jeevitha rajaseskhar;Tamil;India;Heroine;Bharatiya Janata Party;Cinemaఅందంతోనే కాదు రాజకీయ ఎత్తుగడలతో కూడా సత్తా చాటిన హేమమాలిని..!అందంతోనే కాదు రాజకీయ ఎత్తుగడలతో కూడా సత్తా చాటిన హేమమాలిని..!HEMA MALINI;POLITICS;BJP{#}madhura sridhar reddy;Sangeetha;Dream Girl;Padma Shri;tara;Rajya Sabha;Culture;October;Hero;Chitram;jeevitha rajaseskhar;Tamil;India;Heroine;Bharatiya Janata Party;CinemaMon, 01 Jul 2024 06:33:00 GMT•డ్రీమ్ గర్ల్ గా కెరియర్ ప్రయాణం..


* రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయ అరంగేట్రం..

•ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే నైపుణ్యం


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

రాజకీయాలలోకి మహిళలు కూడా అడుగుపెడుతూ సత్తా చాటుతూ ఉండగా.. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది హీరోయిన్లు కూడా మొదట ఒక పార్టీకి సంబంధించి ప్రచారాలను కొనసాగిస్తూ..  ఆ తర్వాత నేరుగా రాజకీయాలలోకి అడుగుపెట్టి.. పలు స్థానాలలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొంది ప్రజల మన్ననలు సొంతం చేసుకున్నారు. ఇక చాలామంది హీరోయిన్స్ తమ అందంతోనే కాదు రాజకీయాలలో ఎత్తుగడలు వేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో అందాల తార హేమమాలిని కూడా ఒకరు. 1948 అక్టోబర్ 16న జన్మించిన హేమమాలిని భారతీయ నటి.. దర్శకురాలు,  నిర్మాత, నాట్య కళాకారిణి గా కూడా వ్యవహరించింది. మొదట తమిళ చిత్రాల ద్వారా సహాయ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత సప్నో కా సౌధాగర్ (1968) అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత ప్రముఖ హీరో ధర్మేంద్ర తో ఎక్కువ సినిమాలు చేసిన ఈమె తర్వాత కాలంలో అతనితో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. అభిమానుల చేత డ్రీమ్ గర్ల్ అని పిలిపించుకున్న హేమమాలిని.. దాదాపు 150 సినిమాలలో నటించింది.. ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి ఏకంగా 11 సార్లు నామినేట్ అవ్వగా పద్మశ్రీ అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా దక్కించుకుంది.. అలాగే 2012లో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకుంది.


ఇక ఒక వైపు సినిమాలలో చేస్తూనే మరొకవైపు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించేది. అలా  జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్ కి చైర్పర్సన్ గా వ్యవహరించింది. భారతీయ సంస్కృతి నృత్యాల విషయంలో ఈమె సేవలకు గుర్తింపుగా ఢిల్లీకి చెందిన భజన్ సపోరీ సంస్థ ఈమెకు  సపోరీ అకాడమీ సంగీత , కళ విటస్టా పురస్కారం ఇచ్చి గౌరవించారు. ఇక తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించిన హేమమాలిని 2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించింది. ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనింది. ఇక తర్వాత 2011 నుండి 2012 వరకు కర్ణాటక నుండి కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన ఈమె తిరిగి  2014 నుండి కూడా రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.


ఇక తర్వాత ప్రజలకు మరిన్ని మంచి పనులు చేస్తూ.. ప్రత్యర్థుల  రాజకీయ ఎత్తుగడలను ముందే గ్రహించి..  ప్రజలలో మన్ననలు పొంది ప్రస్తుతం మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది .. బిజెపి పార్టీ నుండి లోక్సభ సభ్యురాలిగా ఎంపికయింది. ఇక తన అందంతోనే కాదు తన మేధాశక్తి తో కూడా ఖచ్చితమైన పరిపాలన సాగిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది హేమమాలిని







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>