PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/voluntary-suffering-for-chandrababu016a56fb-b60f-4c44-a936-197b36e6cdd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/voluntary-suffering-for-chandrababu016a56fb-b60f-4c44-a936-197b36e6cdd2-415x250-IndiaHerald.jpgముందు అనుకున్న‌ది వేరు.. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది వేరు. దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఇబ్బంది ఏర్ప‌డుతోంది. ఎన్ని క‌ల‌కు ముందు వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసేది లేద‌న్నారు. అక్క‌డితో కూడా బాబు ఆగ‌లేదు. అప్ప‌టి వ‌ర‌కు వారికి అందుతున్న రూ. 5000 గౌర‌వ వేత‌నాన్ని తాను రూ. 10000 ల‌కు పెంచుతాన‌ని చెప్పా రు. ఈ ప్ర‌క‌ట‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికీ వ‌లంటీర్లు చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తున్నారు. అయితే.. రోజులు మారాయి. ఇప్పుడు చంAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; lokesh{#}electricity;June;CBN;YCPచంద్ర‌బాబుకు వాలంట‌రీ బాధ‌...!చంద్ర‌బాబుకు వాలంట‌రీ బాధ‌...!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; lokesh{#}electricity;June;CBN;YCPMon, 01 Jul 2024 10:13:12 GMTముందు అనుకున్న‌ది వేరు.. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది వేరు. దీంతో రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఇబ్బంది ఏర్ప‌డుతోంది. ఎన్ని క‌ల‌కు ముందు వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసేది లేద‌న్నారు. అక్క‌డితో కూడా బాబు ఆగ‌లేదు. అప్ప‌టి వ‌ర‌కు వారికి అందుతున్న రూ. 5000 గౌర‌వ వేత‌నాన్ని తాను రూ. 10000 ల‌కు పెంచుతాన‌ని చెప్పా రు. ఈ ప్ర‌క‌ట‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికీ వ‌లంటీర్లు చంద్ర‌బాబు అప్ప‌ట్లో ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తున్నారు. అయితే.. రోజులు మారాయి.


ఇప్పుడు చంద్ర‌బాబు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగించాలా? వ‌ద్దా? అనే చ‌ర్చ సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే వార్డు, గ్రామ స‌చివాల‌యాల‌ను తీసేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీటి వ‌ల్ల‌.. ఆర్థిక భార‌మే త‌ప్ప‌.. మ‌రొక‌టి లేద‌ని.. ప్ర‌భుత్వం భావిస్తోంది. నెల తిరి గే స‌రికి కరెంటు బిల్లు.. అద్దెలు, ఇత‌ర ఖ‌ర్చుల రూపంలో స‌చివాల‌యాల‌కు పెద్ద ఎత్తున నిధులు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని లెక్క‌లు వేసుకుంది. పైగా.. వీటివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఒన‌గూరుతున్న ప్ర‌యోజ‌నాలు కూడా.. క‌నిపించ‌డం లేద‌ని చంద్ర‌బా బుకు ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు.


దీంతో స‌చివాల‌యాల‌ను దాదాపు మార్పు చేసేదిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు. అదేవిదంగా ప్ర‌స్తుతం ప‌ర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న సెక్ర‌ట‌రీలు.. ఇతర సిబ్బందిని వేరే విభాగానికి ఎటాచ్ చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు రెడీ అవుతున్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు వ‌లంటీర్ల ప‌రిస్థితి ఏంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. వీరిని తీసేయాలంటే.. గ‌త ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తున్నారు. కొన‌సాగిద్దామంటే.. వీరు కేవలం పింఛ‌న్ల పంపిణీకి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు త‌ప్ప‌.. ఇత‌ర ప‌నుల‌కు కాదు.


ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కారు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డిపోయింది. మ‌రోవైపు.. జూన్ నెల మొత్తం కూడా.. వ‌లంటీర్ల‌కు ఎలాంటి ప‌నీ అప్ప‌గించ‌లేదు. 2.3 ల‌క్ష‌ల మంది వలంటీర్లు ఉంటే.. వారిలో 90 వేల మంది రాజీనామాలు చేశారు. వారిని తీసేయ‌గా.. మ‌రో 1.4 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్లు విధుల్లోనే ఉన్నారు. గ‌త రెండు మాసాలు కూడా.. వైసీపీ స‌ర్కారు వారికి సొమ్ములు చెల్లించింది. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో ఎలాంటి ప‌నులూ అప్ప‌గించ‌లేదు. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌. కూడా వారికి ఎలాంటి ప‌నీ ఇవ్వ‌లేదు. కానీ, జూన్ మాసానికి జీతాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో జూలైలో వారికి సంబంధించి నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>