PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-why-vijayamma-went-abroad221e035d-4361-462f-9a8d-1d2e48ec9f79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-why-vijayamma-went-abroad221e035d-4361-462f-9a8d-1d2e48ec9f79-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. vijayamma{#}Dharmavaram;you tube;CBN;Andhra Pradesh;YCP;Jagan;MLA;Partyజగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!జగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ.. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!vijayamma{#}Dharmavaram;you tube;CBN;Andhra Pradesh;YCP;Jagan;MLA;PartyMon, 01 Jul 2024 07:30:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.
 
జగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ అని కేతిరెడ్డి ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైసీపీ ఓటమికి కారణమైన ఇతర అంశాల గురించి సైతం ఆయన ప్రస్తావించారు. పార్టీ ఆలోచనా విధానం, ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మరని అనుకున్నామని జగన్ చాలా నిజాయితీగా అమలు చేసే పథకాల గురించి చెప్పారని కేతిరెడ్డి పేర్కొన్నారు.
 
చంద్రబాబు పింఛన్ ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకిి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. వెల్ఫేర్ ఎక్కువగా అందిన చోటే నాకు ఓట్లు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జగన్ ను ప్రజలు వాళ్ల నాన్నతో పోల్చుకున్నారని కేతిరెడ్డి వెల్లడించారు. గ్రౌండ్ లెవెల్ లో మాకే వ్యతిరేకత కనిపించలేదని ఆయన తెలిపారు. సీఎంవోలో ఉన్న ధనుంజయరెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ ఉండేది కాదని కేతిరెడ్డి పేర్కొన్నారు.
 
చంద్రబాబు అరెస్ట్ క్యాడర్ ను పోలరైజ్ చేసిందని ఆయన తెలిపారు. కమ్మ, కాపు కమ్యూనిటీలు పోలరైజ్ అయ్యాయని కేతిరెడ్డి వెల్లడించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగిందని ఆయన అన్నారు. విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయడం స్టేట్ వైడ్ ఎఫెక్ట్ చూపిందని కేతిరెడ్డి పేర్కొన్నారు. కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. జగన్ పార్టీ ఓటమికి ఒక విధంగా విజయమ్మ కూడా కారణమని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పకనే చెప్పేశారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>