LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsbbc14f2c-f58c-4ccf-98a5-424524615049-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsbbc14f2c-f58c-4ccf-98a5-424524615049-415x250-IndiaHerald.jpgపురుషుల సంతానోత్పత్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే?పురుషుల ఖచ్చితంగా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే స్మెర్మ్‌ కౌంట్‌ను పెంచే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఆకు కూరలు ఇంకా అలాగే ఆకు పచ్చని కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యూలార్ దెబ్బతినకుండా కాపాడతాయని, వీర్య కణాల కదలికలను చురుగ్గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ కు టెస్టోస్టెరాన్ స్థాయులను పెంచే గుణముందనHealth Tips{#}Brazil;Vitamin C;Almonds;Prawns;gummadi;Manamపురుషుల సంతానోత్పత్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే?పురుషుల సంతానోత్పత్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే?Health Tips{#}Brazil;Vitamin C;Almonds;Prawns;gummadi;ManamMon, 01 Jul 2024 22:14:00 GMT
పురుషుల ఖచ్చితంగా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే స్మెర్మ్‌ కౌంట్‌ను పెంచే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఆకు కూరలు ఇంకా అలాగే ఆకు పచ్చని కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యూలార్ దెబ్బతినకుండా కాపాడతాయని, వీర్య కణాల కదలికలను చురుగ్గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ కు టెస్టోస్టెరాన్ స్థాయులను పెంచే గుణముందని పేర్కొన్నారు. పురుషులలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. స్పెర్మ్ కదలికలను మెరుగ్గా ఉంచేందుకు విటమిన్ సి తోడ్పడుతుందని .. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే టమాటాలతో కూడా వీర్య కణాల నాణ్యత పెంచుకోవచ్చని చెప్పారు. 


ఎందుకంటే వీటిలో లైకోపీన్ ఉంటుందట.ప్రతి రోజూ రెండు, మూడు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని వివరించారు. మాంసాహారులైతే సీ ఫుడ్స్ తరచుగా తీసుకోవడం ద్వారా వీర్య పుష్టి పెరుగుతుందట. సముద్రపు చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఇతరత్రా పోషక పదార్థాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇంకా అలాగే వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్, సెలీనియం, విటమిన్-ఇ తదితర పోషకాలు ఉంటాయని చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదం పప్పులకు చోటిస్తే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయని తెలిపారు. బ్రెజిల్ నట్స్ తో వీర్య కణాల వృద్ధితో పాటు ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు. ఇందులోని సెలీనియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతుందని తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>