MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sba0d04596-cf5f-4360-affc-1c483e3ee654-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sba0d04596-cf5f-4360-affc-1c483e3ee654-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. కొంత మంది కి మంచి హిట్ వచ్చినా కూడా ఆ తర్వాత మంచి సినిమా అవకాశాలు లభించవు. మరి కొంత మంది కి నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టిన కూడా మంచి సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇకపోతే సుదీర్ బాబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయన నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న ఈయనకు అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు ఇప్పటికే బsb{#}sudheer babu;venkat;Thriller;Mass;Posters;Box office;Cinemaహిట్లు లేకున్నా ఆఫర్లకు కొదవలేదు.. ఆ జోనర్లో మరో మూవీ స్టార్ట్ చేసిన సుధీర్ బాబు..!హిట్లు లేకున్నా ఆఫర్లకు కొదవలేదు.. ఆ జోనర్లో మరో మూవీ స్టార్ట్ చేసిన సుధీర్ బాబు..!sb{#}sudheer babu;venkat;Thriller;Mass;Posters;Box office;CinemaMon, 01 Jul 2024 21:50:00 GMTసినీ పరిశ్రమలో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. కొంత మంది కి మంచి హిట్ వచ్చినా కూడా ఆ తర్వాత మంచి సినిమా అవకాశాలు లభించవు. మరి కొంత మంది కి నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టిన కూడా మంచి సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇకపోతే సుదీర్ బాబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయన నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న ఈయనకు అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు.

ఈయన నటించిన చాలా సినిమాలు ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొన్ని రోజుల క్రితమే ఈయన హరోం హర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమాతో పాటు విడుదల అయిన మహారాజా మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మరో మూవీని మొదలు పెట్టాడు. ఈయన వెంకట్ కళ్యాణ్ అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో తాజాగా తన కొత్త మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం శివరాత్రి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ సూపర్ నాచురల్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ మూవీగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ తో అయిన సుధీర్ బాబు మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>