Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith01bcb1fe-4526-4dc0-8dd0-bf7d617f6053-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith01bcb1fe-4526-4dc0-8dd0-bf7d617f6053-415x250-IndiaHerald.jpgభారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ సాధించాలి అనుకున్నది సాధించేశాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన ఘనతను అందుకున్న రోహిత్ శర్మ అటు టీమిండియాకు కూడా t20 వరల్డ్ కప్ టైటిల్ అందించి ఏకంగా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కెప్టెన్లలో ఒకటిగా మారిపోయాడు. ఇటీవల యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో కూడా జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడుRohith{#}Mumbai;INTERNATIONAL;Cricket;Yevaru;West Indies;Rohit Sharma;ICC T20;World Cupరోహిత్ సాధించిన ఈ రికార్డును.. ఎవరైనా బ్రేక్ చేయగలరా?రోహిత్ సాధించిన ఈ రికార్డును.. ఎవరైనా బ్రేక్ చేయగలరా?Rohith{#}Mumbai;INTERNATIONAL;Cricket;Yevaru;West Indies;Rohit Sharma;ICC T20;World CupMon, 01 Jul 2024 09:45:00 GMTభారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ సాధించాలి అనుకున్నది సాధించేశాడు. ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన ఘనతను అందుకున్న రోహిత్ శర్మ అటు టీమిండియాకు కూడా t20 వరల్డ్ కప్ టైటిల్ అందించి ఏకంగా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప కెప్టెన్లలో ఒకటిగా మారిపోయాడు. ఇటీవల యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాను ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో కూడా జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు.


 కేవలం కెప్టెన్ గా ఆకట్టుకోవడమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా అదరగొట్టేసాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించాలి అనే కలను నెరవేర్చుకుని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చాడు అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఇక ఇదే శుభ సందర్భంలో తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించారు. మరి ఆ రికార్డును ఎవరు బద్దలు కొడతారు అన్న విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అంతర్జాతీయ టి20 లో అత్యధిక పరుగులు (4231) రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. ఇక అత్యధిక సెంచరీలు (5) రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. ఇక అత్యధిక సిక్సర్లు (205) రికార్డులు హిట్ మ్యాన్ సాధించాడు. మరి ఇప్పుడు అంతర్జాతీయ టి20 కెరియర్ కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతని పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డులను బద్దలు కొట్టబోయే ప్లేయర్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాకుండా తొమ్మిది టి20 వరల్డ్ కప్ లు ఆడిన ఏకైక ప్లేయర్ కూడా రోహిత్ శర్మ కావడం గమనార్హం. కెప్టెన్ గాను అంతర్జాతీయ టి20 లలో అత్యధిక మ్యాచ్ లు (50) గెలిచాడు. ఇక రానున్న రోజుల్లో ఈ రికార్డును బద్దలు కొట్టబోయే ప్లేయర్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>