MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd86f9063-e470-423c-b611-cf551fc6b2af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd86f9063-e470-423c-b611-cf551fc6b2af-415x250-IndiaHerald.jpgడిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వరకు ఊరుకోరు పవన్ అభిమానులు. మొదటి రోజు నుండే కలెక్షన్లు మోత మోగిపోతుంది అని చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరంగా ఉన్నారు. ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి తాజాగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంతకీ tollywood{#}jyothi;kalyan;krish;Pawan Kalyan;Tollywood;Deputy Chief Minister;CM;December;Director;Good news;Good Newwz;Cinema;Newsపవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..!?పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్..!?tollywood{#}jyothi;kalyan;krish;Pawan Kalyan;Tollywood;Deputy Chief Minister;CM;December;Director;Good news;Good Newwz;Cinema;NewsMon, 01 Jul 2024 12:30:00 GMTడిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్  ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే వరకు ఊరుకోరు పవన్ అభిమానులు. మొదటి రోజు నుండే కలెక్షన్లు మోత మోగిపోతుంది అని చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరంగా ఉన్నారు. ఆయన చేసిన ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి తాజాగా ఒక

 గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే..  క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీర సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతుంది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అంతేకాదు ఊహించని విధంగా ఈ సినిమా నుండి డైరెక్టర్ కృష్ణ తప్పుకున్నాడు. జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలను వహిస్తున్నారు. ఐతే  ఇప్పుడు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సగం షూటింగ్ పూర్తయింది. కేవలం 20 25 రోజుల సమయం పవన్ దీని కోసం కేటాయిస్తే ఖచ్చితంగా సినిమా

 మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేసి త్వరలోనే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్. కానీ పవన్ మాత్రం కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చారు. తాజాగా డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన పవర్ స్టార్‌ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్ట్ మొదటివారం నుంచి సినిమాకు డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి ఒక్క 20 రోజులు సినిమాకు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి అవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని డిసెంబర్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్‌ హైలెట్గా నిలవనున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>