PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_tvnews/tdp7e0ca44e-fc95-4833-9c3b-b705002a7c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_tvnews/tdp7e0ca44e-fc95-4833-9c3b-b705002a7c53-415x250-IndiaHerald.jpgరాజకీయ నాయకులను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారపక్షంలోకి వెళ్లిన తర్వాత మరొక ల వ్యవహరిస్తూ ఉంటారు...రాజకీయ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో... ప్రజల కాళ్ళు వేళ్ళు పట్టుకుంటారు. అధికారులు, పోలీసులు అంటే ఎంతో భయం అలాగే గౌరవం ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. అదే ఒక్కసారి అధికారంలోకి వస్తే...అదే రాజకీయ నాయకులకు కొమ్ములు వస్తాయి. tdp{#}kadapa;Department of transportation;Wife;police;Reddy;Raccha;Andhra Pradesh;TDP;YCP;Telugu Desam Party;Party;Ministerటీడీపీ : పోలీసులను పచ్చి బూతులు తిట్టిన మంత్రి భార్య?టీడీపీ : పోలీసులను పచ్చి బూతులు తిట్టిన మంత్రి భార్య?tdp{#}kadapa;Department of transportation;Wife;police;Reddy;Raccha;Andhra Pradesh;TDP;YCP;Telugu Desam Party;Party;MinisterMon, 01 Jul 2024 17:23:00 GMT

ఎక్కడ లేని గర్వం పెరుగుతుంది. అసలు సాధారణ ప్రజలు కనిపించరు. అధికారులు అటు పోలీసులను... చీడ పురుగులాగా   చూస్తారు రాజకీయ నాయకులు. ఇక సదరు రాజకీయ నాయకులకు చెందిన భార్యలు గాని, కుటుంబ సభ్యులు కానీ కూడా.... ప్రజలతో కానీ అధికారులతో కానీ దురుసుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అచ్చం ఏపీలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.


ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి  భార్య చాలా దురుసుగా ప్రవర్తించారు. ఏపీ పోలీసులను బండ బూతులు తిట్టారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య. తనకు పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని... హుకుం కూడా జారీ చేశారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో... ఇవాళ... మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య...పసుపు కండువా వేసుకుని పర్యటించారు. ఈ నేపథ్యంలోనే... పోలీసులను ఇష్టానుసారంగా... బండ బూతులు తిడుతూ... రచ్చ చేశారు. మీకు ఊరికే జీతాలు ఇవ్వడం లేదంటూ ఆగ్రహించారు.

మీకు టీడీపీ సర్కార్‌ జీతం ఇస్తుందని... వైసీపీ పార్టీ నేతలు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. మీ కోసం నేను వేయిట్‌ చేయాలా... యూనిఫాం వేసుకోని రావాలని తెలియదా అంటూ ఆగ్రహించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై.. వైసిపి  పార్టీ  నేతలు తీవ్రస్థాయి లో మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారం వచ్చాక కొమ్ములు మొలిచాయని... అసలు సాధారణ ప్రజలు అలాగే అధికారులు కనిపించడం లేదని... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>