PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kushboo6a1e69e5-7c6f-4878-8d30-71632ba77add-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kushboo6a1e69e5-7c6f-4878-8d30-71632ba77add-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గతంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో ఖుష్బూ ముందువరసలో ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. తెలుగులో ఇప్పటికీ పాత్ర నచ్చితే నటించడానికి ఖుష్బూ ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య కాలంలో ఖుష్బూ రామబాణం సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు. kushboo{#}khushboo;2020;Jr NTR;Tollywood;Assembly;Party;Doctor;Tamil;రాజీనామా;Congress;Cinema;Kollywood;Successరాజకీయాల్లో ఖుష్బూ అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. వాళ్లు అస్సలు నమ్మట్లేదుగా!రాజకీయాల్లో ఖుష్బూ అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. వాళ్లు అస్సలు నమ్మట్లేదుగా!kushboo{#}khushboo;2020;Jr NTR;Tollywood;Assembly;Party;Doctor;Tamil;రాజీనామా;Congress;Cinema;Kollywood;SuccessMon, 01 Jul 2024 07:18:00 GMTటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో గతంలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో ఖుష్బూ ముందువరసలో ఉంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. తెలుగులో ఇప్పటికీ పాత్ర నచ్చితే నటించడానికి ఖుష్బూ ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య కాలంలో ఖుష్బూ రామబాణం సినిమాలో నటించగా ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.
 
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖుష్బూకు ఎంతో అభిమానం కాగా తారక్ తో కలిసి ఇప్పటికే యమదొంగ సినిమాలో నటించిన ఖుష్బూ భవిష్యత్తులో తారక్ సినిమాలో మళ్లీ నటించాలని ఆశ పడుతున్నారు. అయితే సినిమాల్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఖుష్బూ రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పవచ్చు. పాలిటిక్స్ లో సక్సెస్ కావాలని ఖుష్బూ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.
 
ఖుష్బూ 2010 సంవత్సరంలో డీఎంకే పార్టీలో జాయిన్ అయ్యి వేర్వేరు కారణాల వల్ల 2014 సంవత్సరంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. డీఎంకేకు దూరమైన తర్వాత ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు. 2020 సంవత్సరంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఖుష్బూ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వెంటనే ఖుష్బూ బీజేపీలో జాయిన్ అయ్యారు.
 
2021 ఎన్నికల్లో థౌజండ్ లైట్స్ అనే నియోజకవర్గం నుంచి ఖుష్బూ పోటీ చేయగా అమెకు షాకిచ్చేలా ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఖుష్బూపై ఏకంగా 32,462 ఓట్ల తేడాతో డీఎంకేకు చెందిన డాక్టర్ ఎన్ ఎజిలన్ విజయం సాధించారు. ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలుగా ఉన్నారు. తమిళనాడులో రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా ఖుష్బూ విజయం సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఖుష్బూ వ్యక్తిగత కారణాలతో పార్టీలు మారడం, ఓటర్లలో నమ్మకాన్ని కలిగించలేకపోవడం ఆమె రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలని చాలామంది భావిస్తారు. తమిళ తంబీలు ఖుష్బూను అస్సలు నమ్మట్లేదని అందువల్లే రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అయినా ఆమెకు పాలిటిక్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదని చాలామంది ఫీలవుతారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>