Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-vijayashanthi11bfde21-db75-43b0-ab74-b3d93dadce79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-vijayashanthi11bfde21-db75-43b0-ab74-b3d93dadce79-415x250-IndiaHerald.jpg* తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని స్టార్ డం రాములమ్మకు సొంతం * 40 ఏళ్ల సినీ ప్రయాణంలో విలక్షణ నటిగా గుర్తింపు *రాజకీయ అరంగ్రేటంతో సంచలనం సృష్టించిన విజయశాంతి *25 ఏళ్ల రాజకీయ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిందిగా సినీ రంగంలో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.టాలీవుడ్ లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేవిధంగా అనూహ్య స్టార్ డం అందుకొని హీరోయిన్ పాత్రల స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత విజయశాంతి కే సొంతం.40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ #vijayashanthi{#}Parliment;Medak;Vijayashanti;Congress;రాజీనామా;Party;Telangana;Bharatiya Janata Party;MP;Heroine;Telugu;Amitabh Bachchanపాతికేళ్ళ రాజకీయ ప్రస్థానం.. విజయశాంతి సాధించిందేంటి..?పాతికేళ్ళ రాజకీయ ప్రస్థానం.. విజయశాంతి సాధించిందేంటి..?#vijayashanthi{#}Parliment;Medak;Vijayashanti;Congress;రాజీనామా;Party;Telangana;Bharatiya Janata Party;MP;Heroine;Telugu;Amitabh BachchanSun, 30 Jun 2024 22:09:17 GMT* తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని స్టార్ డం రాములమ్మకు సొంతం
* 40 ఏళ్ల సినీ ప్రయాణంలో విలక్షణ నటిగా గుర్తింపు
*రాజకీయ అరంగ్రేటంతో సంచలనం సృష్టించిన విజయశాంతి  
*25 ఏళ్ల రాజకీయ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పిందిగా

సినీ రంగంలో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు.టాలీవుడ్ లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన విజయశాంతి స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేవిధంగా అనూహ్య స్టార్ డం అందుకొని  హీరోయిన్ పాత్రల స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత విజయశాంతి కే సొంతం.40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటన ,విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విజయశాంతి ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.తెలంగాణ పోరాటంలో ఆమె స్థానం ఎంతో ప్రత్యేకం.పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సాకారమవ్వడంలో ఆమె విశేష కృషి చేసారు.1998 లో రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు.విజయశాంతి బీజేపీ లో చేరడంతోనే ఆ పార్టీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1999 లో బీజేపీ విజయానికి రాములమ్మ ఎంతగానో కృషి చేసారు.బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా ఆమె చేసిన ప్రసంగాలు ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి ఎంతగానో ఉత్సాహాన్ని తెప్పించింది.అప్పట్లో ఆమె రాజకీయాలకి కొత్త కావడం ,లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు వుండడటంతో నెల్లూరులో ఆమె పాల్గొన్న సభ విజయవంతం అయింది.దీనితో బీజేపీలో ఆశలు రేగాయి .

అయితే అదే సమయంలో విజయశాంతి కూడా పూర్తిస్థాయిలో రాజకీయాల పట్ల దృష్టి సారించి నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో 2009 లో "తల్లి తెలంగాణ" పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రము కోసం ఆమె ఉద్యమించారు.తెలంగాణ సాధన కోసం ఒకే వేదికపై కొట్లాడదాం అనే తెలంగాణ సిద్ధాంత కర్తల మాటలకు విలువిచ్చి తన తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టిఆర్ఎస్ లో విలీనం చేసారు.అప్పటి నుండి విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో విజయశాంతి ఎంతో చురుకుగా పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో 2009 సాధారణ ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి తొలిసారి పార్లమెంట్ లో  అడుగు పెట్టారు.ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె 2011 లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసారు.ఆ తరువాత మూడేళ్లు ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.అయితే అనూహ్యంగా కెసిఆర్ తో విభేదాలతో ఆమె టిఆర్ఎస్ కు దూరం కావాల్సి వచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన విజయశాంతికి తెలంగాణ పునర్నిర్మాణంలో అవకాశం లేకుండా పోయింది.దీనితో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.2014 ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా వున్నారు.2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ గా నియమించారు.కానీ ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.ఆ తరువాత మళ్ళి బీజేపీ  లో చేరిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.2023  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ కాంపైనర్ గా పని చేసారు.ఈ సారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయ దుందుభి మ్రోగించింది.ప్రస్తుతం విజయశాంతి సినిమాలలో నటిస్తూనే రాజకీయంగా కూడా ఎంతో బిజీ గా వున్నారు.

   









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>