MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas7f33d4d1-3e8a-4fed-9eff-db7b94502d86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas7f33d4d1-3e8a-4fed-9eff-db7b94502d86-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నాగ్ అశ్విన్ , నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మహానటి మూవీ తో కమర్షియల్ గా సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా రూపొందిన కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే అత్యంత కీలకమైన పాత్రలలో నటించగా ... మృణాల్ ఠాగూర్ , శోభన , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో నటింprabhas{#}Nani;Ram Gopal Varma;Shobhana;Brahmanandam;disha patani;rajendra prasad;Rajamouli;vijay deverakonda;Yevade Subramanyam;tuesday;Mahanati;babu rajendra prasad;June;Darsakudu;Director;monday;dulquer salmaan;Prabhas;nag ashwin;vijay kumar naidu;Telugu;Success;Box office;Cinemaకల్కి 2898 AD : అప్పటి నుండి తగ్గనున్న టికెట్ రేట్లు.. మళ్లీ మూవీ చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్..?కల్కి 2898 AD : అప్పటి నుండి తగ్గనున్న టికెట్ రేట్లు.. మళ్లీ మూవీ చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్..?prabhas{#}Nani;Ram Gopal Varma;Shobhana;Brahmanandam;disha patani;rajendra prasad;Rajamouli;vijay deverakonda;Yevade Subramanyam;tuesday;Mahanati;babu rajendra prasad;June;Darsakudu;Director;monday;dulquer salmaan;Prabhas;nag ashwin;vijay kumar naidu;Telugu;Success;Box office;CinemaSun, 30 Jun 2024 12:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి నాగ్ అశ్విన్ , నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మహానటి మూవీ తో కమర్షియల్ గా సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా రూపొందిన కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే అత్యంత కీలకమైన పాత్రలలో నటించగా ... మృణాల్ ఠాగూర్ , శోభన , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఇక ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అత్యంత భారీ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టికెట్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి. ఇక రేపు అనగా సోమవారం రోజు నుండి ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సిసలైన పరీక్ష మొదలు కానుంది.

ఈ సినిమాకు రేపు కనుక మంచి కలెక్షన్లు వచ్చినట్లు అయితే ఈ మూవీ బృందం ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మరికొన్ని రోజులు థియేటర్లలో ఈ సినిమాను ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ రేపు కనక ఈ సినిమా కలెక్షన్లు ఎక్కువ మొత్తంలో పడిపోతే టికెట్ ధరలను తగ్గించే ఆలోచనలు ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి రేపు ఈ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో దానిని బట్టి మంగళవారం నుండి ఈ సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయా ... తగ్గనున్నాయా అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>