MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb25767e0-62f5-421f-9a72-497348e7cdaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb25767e0-62f5-421f-9a72-497348e7cdaa-415x250-IndiaHerald.jpgరాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమా ఖ్యాతి దశదిశల ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు నుండి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అద్భుత స్థాయిలో విజయాలను సాధిస్తూ ఉండడంతో మన స్టార్ హీరోలు అంతా దాదాపుగా పాన్ ఇండియా సినిమాలపై పడిపోయారు. దానితో ఈ మధ్యకాలంలో ఒక ప్రభాస్ ను మినహాయిస్తే ఏ టాలీవుడ్ స్టార్ హీరో కూడా సంవత్సరానికి ఒక సినిమాను కూడా విడుదల చేయలేకపోతున్నాడు. దానితో చిన్న హీరోలు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు. కానీ వారు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి ఇంపాక్ట్ ను చూపించలtollywood{#}prasanth varma;sukumar;teja;Godavari River;Box office;Hero;Tollywood;June;Prabhas;vijay kumar naidu;Telugu;Cinema;India2024 : తెలుగు సినిమా పరిస్థితి ఇంత ఘోరమా.. ఇప్పటికి కేవలం అన్ని విజయాలు..?2024 : తెలుగు సినిమా పరిస్థితి ఇంత ఘోరమా.. ఇప్పటికి కేవలం అన్ని విజయాలు..?tollywood{#}prasanth varma;sukumar;teja;Godavari River;Box office;Hero;Tollywood;June;Prabhas;vijay kumar naidu;Telugu;Cinema;IndiaSun, 30 Jun 2024 10:00:00 GMTరాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకుల వల్ల తెలుగు సినిమా ఖ్యాతి దశదిశల ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు నుండి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అద్భుత స్థాయిలో విజయాలను సాధిస్తూ ఉండడంతో మన స్టార్ హీరోలు అంతా దాదాపుగా పాన్ ఇండియా సినిమాలపై పడిపోయారు. దానితో ఈ మధ్యకాలంలో ఒక ప్రభాస్ ను మినహాయిస్తే ఏ టాలీవుడ్ స్టార్ హీరో కూడా సంవత్సరానికి ఒక సినిమాను కూడా విడుదల చేయలేకపోతున్నాడు. దానితో చిన్న హీరోలు తమ సినిమాలతో సందడి చేస్తున్నారు.

కానీ వారు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్నారు. ఇక ప్రతి సంవత్సరం మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా శాతం విజయాలు దక్కుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు చాలా కఠినమైన పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జూన్ నెల చివరి దశకు చేరుకుంది. అంటే దాదాపుగా ఇప్పటికే సగం సంవత్సరం కంప్లీట్ అయింది. అందులో భాగంగా తెలుగు నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించిన సినిమాల సంఖ్య చూస్తే అత్యంత తక్కువగా కనబడుతుంది. ఈ సంవత్సరం మొదటగా తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.

సినిమా విజయంతో తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి శుభారంభం ఈ సంవత్సరం లభించింది. కానీ ఆ తర్వాత అది కంటిన్యూ కాలేదు. ఇక ఇప్పటివరకు ఆరు నెలలు ముగిసిన హనుమాన్ మూవీ తర్వాత డిజె టిల్లు మూవీకే సూపర్ సాలిడ్ విజయాలు దక్కాయి. ఇక మధ్యలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి , మనమే సినిమాలు విజయాలను అందుకున్న అవి నిర్మాతలకు పెద్ద స్థాయిలో లాభాలను ఏమీ తెచ్చి పెట్టలేదు. ఇక కొన్ని రోజుల క్రితమే కల్కి విడుదల అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. మరి ఈ సినిమా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>