PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-chandrababu-a-new-fight-on-screenc6960288-9f9e-459d-b705-69681567249a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ramoji-rao-chandrababu-a-new-fight-on-screenc6960288-9f9e-459d-b705-69681567249a-415x250-IndiaHerald.jpgమీడియా మొఘ‌ల్, ఈనాడు అధినేత రామోజీరావు.. జూన్ 9న క‌న్నుమూశారు. ఆయ‌న‌కు, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో ఎంతో బిజీగా ఉన్న ఆ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ఢిల్లీ నుంచి ప‌రుగుప‌రుగున హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. రామోజీరావును నివాళుల‌ర్పించారు. ఆయ‌న పాడె కూడా మోసిరుణం తీర్చుకున్నారు. ఇక్క‌డితో కూడా ఆయ‌న ఆగ‌లేదు. ఏపీ అధికారుల‌ను ఫిలిం సిటీకి ర‌ప్పించి.. అధికారిక నివాళులు అర్పించారు. అక్క‌డితో చంద్ర‌బాబు స‌రిపుచ్చితే స‌రిపోయేది. కానీ, చంద్ర‌బాబు త‌న అభిమానాన్ని పAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; tdp; Ramoji Rao{#}media;eenadu;Delhi;CBN;June;Telangana;Andhra Pradesh;Chiranjeeviరామోజీ రావు - చంద్ర‌బాబు... తెర‌మీద‌కు కొత్త గొడ‌వ‌...?రామోజీ రావు - చంద్ర‌బాబు... తెర‌మీద‌కు కొత్త గొడ‌వ‌...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; tdp; Ramoji Rao{#}media;eenadu;Delhi;CBN;June;Telangana;Andhra Pradesh;ChiranjeeviSun, 30 Jun 2024 09:54:05 GMTమీడియా మొఘ‌ల్, ఈనాడు అధినేత  రామోజీరావు.. జూన్ 9న క‌న్నుమూశారు. ఆయ‌న‌కు, ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌ధ్య ఫెవికాల్ బంధం ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో ఎంతో బిజీగా ఉన్న ఆ స‌మ‌యంలోనూ చంద్ర‌బాబు ఢిల్లీ నుంచి ప‌రుగుప‌రుగున హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. రామోజీరావును నివాళుల‌ర్పించారు. ఆయ‌న పాడె కూడా మోసిరుణం తీర్చుకున్నారు. ఇక్క‌డితో కూడా ఆయ‌న ఆగ‌లేదు. ఏపీ అధికారుల‌ను ఫిలిం సిటీకి ర‌ప్పించి.. అధికారిక నివాళులు అర్పించారు.


అక్క‌డితో చంద్ర‌బాబు స‌రిపుచ్చితే స‌రిపోయేది. కానీ, చంద్ర‌బాబు త‌న అభిమానాన్ని ప్ర‌జాభిమానంగా.. ప్ర‌భుత్వ అభిమానంగా మార్చి.. 12 కోట్ల రూపాయ‌ల‌కు పైగా  ఖ‌ర్చు చేసి.. విజ‌య‌వాడ శివారులో రామోజీ సంస్మ‌ర‌ణ స‌భ‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఇది ఘ‌నంగానే జ‌రిగిపోయింది. పెద్ద పెద్ద స్టార్లు కూడా వ‌చ్చారు. కానీ, చిరు మాత్రం రాలేదు. ఇదే.. ఇప్పుడు వివాదానికి దారి తీసింది. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌ధాన మీడియాలోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


ఎందుకంటే.. అధికారిక లాంఛ‌నాలు ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం.. అక్కడితో రామోజీకి నివాళులు స‌రిపుచ్చింది. వాస్త‌వానికి తెలంగాణ‌కు రామోజీవ‌ల్ల ... రోజూ ఆదాయం ఉంది. ఆయ‌న క‌ట్టి ఫిలింసిటీ కార‌ణంగా.. తెలంగాణ ప్ర‌భుత్వానికి రోజూ.. రూ.కోట్ల‌లో ప‌న్నులు వ‌స్తున్నాయి. ఇవి కాకుండా.. జీఎస్టీ రూపంలోనూ ప‌న్నులువస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. రామోజీ ఎన్ని సేవ‌లు చేసిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ప్రజా నేత కాదు. ఆయ‌న ఎప్పుడూ.. ప్ర‌త్య‌క్ష ప్రజాసేవ చేయ‌లేదు.


దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు నివాళులు, అధికారిక లాంఛ‌నాలతో స‌రిపెట్టింది. దీనిని అంద‌రూ స్వాగ‌తించారు. కానీ, ఏపీ ప్ర‌భుత్వం ముఖ్యంగా చంద్ర‌బాబు మ‌రో ప‌ది అడుగులు ముందుకు వేశారు. ఒక‌వైపు ఖ‌జానా కొల్ల‌బోతోంద‌ని చెబుతూనే.. అధికారిక కార్య‌క్ర‌మం కింద‌.. రామోజీకి ఘ‌న నివాళుల‌ర్పించే కార్య‌క్ర‌మం చేశారు. అయితే.. ఆయ‌న ప్ర‌జాప్ర‌తినిధి కాక‌పోవ‌డంతోపాటు.. ఆయ‌న వ్యాపార వేత్త‌గా గుర్తింపు పొందండంతో చంద్ర‌రాబు చేసింది స‌రికాద‌ని.. అన్నివ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని బాబు అనుకూల మీడియాలోనే ప్రొజెక్టు చేయ‌డం గ‌మ‌నార్హం. అతిగా స్పందిచారంటూ.. ఆ మీడియా రాసుకొచ్చింది. ఇక‌మీద‌టైనా.. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేసేప్పుడు.. జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల‌న్న‌ది మేధావుల నుంచి వ‌స్తున్న సూచ‌న‌.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>