MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad--prabhasb3cbb9a0-9e75-4c0f-aafa-2cc2ab94519d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad--prabhasb3cbb9a0-9e75-4c0f-aafa-2cc2ab94519d-415x250-IndiaHerald.jpgకల్కి 2898 AD ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అశ్వాద్దామ, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్​ను ఆయన మలిచిన తీరుకు వావ్ అంటున్నారు. ఇంకా పార్ట్ 2 లో దుల్కర్ సల్మాన్ పరశురాముడి రోల్ ప్లే చేస్తున్నట్లుగాKalki 2898 AD - Prabhas{#}Idea;Maha;Audience;Ashwathama;Hero;vijay kumar naidu;News;Bachula Arjunudu;dulquer salmaan;Blockbuster hit;nag ashwin;Prabhas;Cinemaప్రభాస్ ఇచ్చిన ఐడియా వల్లే కల్కి ఇంత పెద్ద హిట్టయ్యింది?ప్రభాస్ ఇచ్చిన ఐడియా వల్లే కల్కి ఇంత పెద్ద హిట్టయ్యింది?Kalki 2898 AD - Prabhas{#}Idea;Maha;Audience;Ashwathama;Hero;vijay kumar naidu;News;Bachula Arjunudu;dulquer salmaan;Blockbuster hit;nag ashwin;Prabhas;CinemaSat, 29 Jun 2024 20:31:00 GMTకల్కి 2898 AD ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అశ్వాద్దామ, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్ను ఆయన మలిచిన తీరుకు వావ్ అంటున్నారు. ఇంకా పార్ట్ 2 లో దుల్కర్ సల్మాన్ పరశురాముడి రోల్ ప్లే చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మహా భారతం హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో నడుస్తుంది. కాంప్లెక్స్ లోకి వెళ్లడం కోసం సుమతిని విలన్ మనుషులకి అప్పగించడానికి అశ్వద్ధామతో ఫైట్ చేస్తాడు ప్రభాస్. అయితే అశ్వద్ధామతో ఓడిపోతూ ఉంటాడు. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అశ్వద్ధామ భైరవ ప్రాణాలని తీసేంత వరకు వెళ్తాడు.


అయితే విలన్ గ్యాంగ్ అశ్వద్ధామని బంధించి సుమతిని తీసుకుపోయే సమయంలో భైరవ క్యారెక్టర్ ఒక్కసారిగా కర్ణుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యి... కర్ణుడిగా మారిన భైరవ విలన్ గ్యాంగ్ ని చంపేసి సుమతిని కాపాడుతాడు. ఈ సీక్వెన్స్ కి అయితే ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడ్డాయి. భైరవ కాస్తా కర్ణుడిగా మారే ఎలిమెంట్ మొత్తం గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. అంతగా పబ్లిక్ కర్ణుడి పాత్రకి కనెక్ట్ అయ్యారు. నిజానికి నాగ్ అశ్విన్ భైరవని మామూలు సూపర్ హీరోగానే చూపించాలని అనుకున్నాడట. అయితే భైరవకి మైథాలజీ హీరో క్యారెక్టర్ ని ఎడాప్ట్ చేస్తే బాగుంటుందని ప్రభాస్ ఐడియా ఇచ్చాడట. అక్కడి నుంచి కర్ణుడి ఐడియా నాగ్ అశ్విన్ కి వచ్చి దానిని చివర్లో చూపించాడు.వాస్తవానికి భాగవతంలో గాని కల్కి పురాణంలో గాని కర్ణుడి ప్రస్తావన ఎక్కడ ఉండదు. నాగ్ అశ్విన్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈ క్యారెక్టర్ ని కల్కి స్టోరీకి లింక్ చేశాడు. అయితే ఇది సాధారణ ఆడియన్స్ కి అయితే బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ హిందూ పురాణాలు, ఇతిహాసాలు విశ్వసించేవారు మాత్రం ఈ సినిమాటిక్ లిబర్టీని వ్యతిరేకిస్తున్నారు. కల్కి పురాణంతో సంబంధం లేని కర్ణుడిని రిప్రజెంట్ చేయడం భారతీయ ఇతిహాసాలని ఖచ్చితంగా వక్రీకరించడమే అవుతుందని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>