Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcree92c599-ed69-4dbf-b7f4-e5b48c090529-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcree92c599-ed69-4dbf-b7f4-e5b48c090529-415x250-IndiaHerald.jpgతెలంగాణ కోసం దశాబ్ద కాలానికి పైగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడిగా పేరు సంపాదించుకున్న కేసీఆర్ భవితవ్యం ఏమిటి.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఇదే విషయంపై ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో సీఎం కుర్చీల్లో కూర్చోగలిగారు కేసీఆర్. ఇలా రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేశారు. కానీ మూడోసారి మాత్రం ఎందుకో కేసిఆర్ తీరు ప్రజలకు నచ్చక ప్రతిపక్ష హోదాలోనే కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజానీకం. అయితే Kcr{#}Car;srinivas;KCR;CM;Congress;Assembly;Party;Telanganaపొత్తా.. విలీనమా.. కేసీఆర్ ముందు రెండే అప్షన్స్?పొత్తా.. విలీనమా.. కేసీఆర్ ముందు రెండే అప్షన్స్?Kcr{#}Car;srinivas;KCR;CM;Congress;Assembly;Party;TelanganaSat, 29 Jun 2024 10:30:00 GMTతెలంగాణ కోసం దశాబ్ద కాలానికి పైగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన యోధుడిగా పేరు సంపాదించుకున్న కేసీఆర్ భవితవ్యం ఏమిటి.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఇదే విషయంపై ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  బిఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో సీఎం కుర్చీల్లో కూర్చోగలిగారు కేసీఆర్. ఇలా రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేశారు.


 కానీ మూడోసారి మాత్రం ఎందుకో కేసిఆర్ తీరు ప్రజలకు నచ్చక ప్రతిపక్ష హోదాలోనే కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజానీకం.  అయితే ఒక్కసారి కారు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో లేదో ఆ పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పార్టీలోని కీలక నేతలు ఏకంగా కేసీఆర్ నమ్మిన బంటు లాంటి నాయకులు హస్తం గూటికి చేరుకున్నారు. కేకే, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా ఇక.. సిట్టింగులుగా ఉన్నవారు సైతం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇక కారు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. రానున్న రోజుల్లో మరి కొంతమంది పార్టీ మారే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.


 ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఒక్క కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన నేతలు తప్ప మిగతా ఎవరైనా ఆ పార్టీలో ఉంటారా అంటే ఉంటారు అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కేసీఆర్ రాజకీయ భవితవ్యం ఏమిటి అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దీంతో కేసిఆర్ కు కేవలం రెండే రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.  ఖాళీ అయిన టిఆర్ఎస్ పార్టీని మరో పార్టీలో విలీనం చేయడం లేదంటే ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో  పోటీ చేయడం తప్ప ఒక కేసీఆర్ కు మరో ఆప్షన్ లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పొత్తు పెట్టుకునేందుకు ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ తో పొత్తు అంటే ఆమడ దూరం ఉంటాయి. మరోవైపు ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న పార్టీని కేసీఆర్ మరో పార్టీలో విలీనం చేసే అవకాశాలు కూడా తక్కువే. మరి భవిష్యత్తులో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>