PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sharmila-revanth-reddy-chandrababu-ap-ys-rajashekhar-reddy8e05982a-99fe-4ccb-86b7-b7db8d8d13d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-sharmila-revanth-reddy-chandrababu-ap-ys-rajashekhar-reddy8e05982a-99fe-4ccb-86b7-b7db8d8d13d9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇక జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే ఉన్నారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడేది. అయినా పై చేయి రాజశేఖర్ రెడ్డి మాత్రమే సాధించేవారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఏళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు. ఇదే టైంలో ఆయన చాలా ఆస్తులు కూడా సంపాదించారు. కడప జJAGAN;SHARMILA;REVANTH REDDY;CHANDRABABU;AP;YS RAJASHEKHAR REDDY{#}bharathi old;vijayalakshmi;kadapa;Sharmila;dr rajasekhar;Government;Election;Reddy;Revanth Reddy;Congress;Telangana;CBN;Andhra Pradesh;CM;Jaganషర్మిల బిగ్ స్కెచ్..ఆస్తులు ఇప్పించాలని బాబు రేవంత్ లను కోరిందా..?షర్మిల బిగ్ స్కెచ్..ఆస్తులు ఇప్పించాలని బాబు రేవంత్ లను కోరిందా..?JAGAN;SHARMILA;REVANTH REDDY;CHANDRABABU;AP;YS RAJASHEKHAR REDDY{#}bharathi old;vijayalakshmi;kadapa;Sharmila;dr rajasekhar;Government;Election;Reddy;Revanth Reddy;Congress;Telangana;CBN;Andhra Pradesh;CM;JaganSat, 29 Jun 2024 10:21:00 GMT ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకొచ్చేది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇక జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే ఉన్నారు.  ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడేది. అయినా పై చేయి రాజశేఖర్ రెడ్డి మాత్రమే సాధించేవారు. ఆ విధంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఏళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు. ఇదే టైంలో ఆయన చాలా ఆస్తులు కూడా సంపాదించారు. కడప జిల్లాలో భూములు, సాక్షి, భారతి సిమెంట్ ఇంకా ఎన్నో స్థిరా, చర ఆస్తులు ఉన్నాయి. ఇందులో చాలా ఆస్తులు కొన్ని జగన్ పేరిట కొన్ని విజయలక్ష్మి పేరిట మరికొన్ని షర్మిల పేరిట ఆయన రాశారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత  ఈ ఆస్తులు అన్ని జగన్ తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

 అంతేకాకుండా  ఆయన సీఎం అయిన తర్వాత అసలు షర్మిలకు ఆస్తులు లేవంటూ ఆమెను పక్కకు నెట్టేసారట.  దీంతో కోపానికి వచ్చిన షర్మిల జగన్ పై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. తన ఆస్తులు తనకు పంచాలని మొరపెట్టుకుంది. అయినా  జగన్ తన అధికార బలంతో  తిప్పి కొట్టారు. అంతేకాకుండా ఈ ఆస్తులపై ఈడీ అటాచ్మెంట్ ఉందని, ఇవి పంచరాదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఉన్న ఆస్తులు అన్ని తన దగ్గర పెట్టుకున్నటువంటి  జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తన ఆస్తులు ఎలాగైనా తీసుకోవాలని షర్మిల అనేక విధాల ప్రయత్నాలు చేస్తోంది. అయినా జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్లు సాధ్యం కాలేదు. 2024 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. దీంతో షర్మిల మళ్లీ ఆస్తుల వ్యవహారం బయటకు తీసుకు వచ్చింది.

తన ఆస్తులు తనకు రావాలంటే ఎవరెవరిని కలవాలో వారందరిని కలుస్తోందట. ముఖ్యంగా ఆమె  ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆస్తుల వ్యవహారం చెప్పిందట. తన అన్న నుంచి తనకు న్యాయం చేయాలని కోరిందట. అయితే ఈ వ్యవహారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నడిపిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షర్మిల రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబులను ముందు పెట్టి తన అన్నతో ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారాన్ని ఎలాగైనా తేల్చుకోవాలనే ప్లాన్ వేసిందట. ఇదే తరుణంలో ఆమె ఇద్దరు సీఎంలను కలిసినట్టు కూడా తెలుస్తోంది.  కానీ చంద్రబాబు టైం పడుతుంది కొన్ని నెలల తర్వాత చూద్దాం.ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పినట్టు తెలుస్తోంది.  ఈ విధంగా అన్న నుంచి ఆస్తులు పంచుకునేందుకు అద్భుతమైన స్కెచ్ తో షర్మిల  ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>