MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalaki-kamahasan44956247-e802-499e-8c92-cf014db58d11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalaki-kamahasan44956247-e802-499e-8c92-cf014db58d11-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ విడుదలైనప్పటి నుంచి ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూనే ఉన్నది.. ఇందులో నటించిన స్టార్ యాక్టర్స్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రభాస్, కమలహాసన్, అమితాబచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే తదితర సెలెబ్రెటీలు కూడా ఇందులో నటించడంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలను కూడా అందుకుందని చెప్పవచ్చు.. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత కథ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చితKALAKI;KAMAHASAN{#}Aswani Dutt;Chitram;nag ashwin;vijay kumar naidu;News;Prabhas;Cinemaకల్కి 2898AD: 7 నిమిషాలకే అన్ని కోట్లు తీసుకున్న కమలహాసన్..!కల్కి 2898AD: 7 నిమిషాలకే అన్ని కోట్లు తీసుకున్న కమలహాసన్..!KALAKI;KAMAHASAN{#}Aswani Dutt;Chitram;nag ashwin;vijay kumar naidu;News;Prabhas;CinemaSat, 29 Jun 2024 20:08:00 GMTడైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ విడుదలైనప్పటి నుంచి ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూనే ఉన్నది.. ఇందులో నటించిన స్టార్ యాక్టర్స్ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రభాస్, కమలహాసన్, అమితాబచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనే తదితర సెలెబ్రెటీలు కూడా ఇందులో నటించడంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలను కూడా అందుకుందని చెప్పవచ్చు.. కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత కథ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.అలాగే ఈ సినిమా కోసం నటీనటుల రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కమలహాసన్ వంటి హీరోలు ఈ చిత్రంలో కనిపించింది తక్కువ సేపు అయినప్పటికీ భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో నటించగా అమితాబచ్చన్ అశ్వద్ధామ.. కమలహాసన్ విలన్ గా నటించారు. ఆయన పాత్ర పేరు యాస్కిన్. మొదటిసారి ఇలాంటి వృద్ధుడి పాత్రల కనిపించాడు కమలహాసన్.


ముసలి విలన్ గా అందరినీ ఆకట్టుకున్న కమలహాసన్ చివరిలో ఆయన పాత్ర నిజస్వరూపం బయటపడుతుంది. సినిమాలో కమలహాసన్ పాత్ర కేవలం మూడు సన్నివేశాలలో మాత్రమే చూపించారు ఈ సినిమా ముగిసే సమయంలో కమలహాసన్ కనిపించడం గమనార్హం. మొదటి భాగంలో కల్కి చిత్రం నుంచి కమలహాసన్ పాత్ర పెద్దగా స్కోప్ లేదని రెండవ భాగంలో విలన్ పాత్ర మొత్తం కమల హాసన్ మీద ఆధారపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి చిత్రానికి కమలహాసన్ రూ.20 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 7 నిమిషాల 4 సెకండ్లకు 20 కోట్లు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే కల్కి రెండవ భాగం 60% వరకు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 40 భాగం మాత్రమే షూటింగ్ మిగిలినట్లు అశ్వని దత్ తెలియజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>