MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva498642ac-1b4c-4798-82a3-e2910709859b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva498642ac-1b4c-4798-82a3-e2910709859b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన తన కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఈయన కథలను అందించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కొరటాల కథలను అందించిన సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన కూడా దర్శకత్వం రూట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో ఈయన దర్శకుడుగా కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన దర్శకshiva{#}koratala siva;Mirchi;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Srimanthudu;september;October;Chiranjeevi;NTR;Prabhas;Box office;Cinema;Newsకొరటాల గ్రేట్.. మొదట్లో విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు..?కొరటాల గ్రేట్.. మొదట్లో విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు..?shiva{#}koratala siva;Mirchi;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Srimanthudu;september;October;Chiranjeevi;NTR;Prabhas;Box office;Cinema;NewsSat, 29 Jun 2024 21:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన తన కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. ఈయన కథలను అందించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కొరటాల కథలను అందించిన సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన కూడా దర్శకత్వం రూట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో ఈయన దర్శకుడుగా కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక ఆఖరుగా కొరటాల , చిరంజీవి హీరోగా ఆచార్య మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ భారీ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే కొరటాల, ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా నెక్స్ట్ కొరటాలతోనే చేస్తున్నాడు. ఇకపోతే ఆచార్య ప్లాప్ వల్ల కొరటాలపై ప్రెషర్ పెరగడంతో ఎన్టీఆర్ తో తీసే సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి అని చాలా రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయాన్ని కేటాయించాడు.

 దానితో ఎన్టీఆర్ అభిమానులు కొరటాలపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక, ఈ సినిమా యొక్క చిత్రీకరణను కొరటాల జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తూ వచ్చాడు. దానితో ఈ మూవీని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన అంతకు చాలా ముందే ఈ సినిమా పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు నిరుత్సాహపడ్డ ఎన్టీఆర్ అభిమానులు, ఈ సినిమా షూటింగ్ను ఫుల్ స్పీడ్గా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు ప్రస్తుతం సంతోష పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>