EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kalkid4c50f50-e2d5-4543-b1e0-60c8feb832cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kalkid4c50f50-e2d5-4543-b1e0-60c8feb832cd-415x250-IndiaHerald.jpgకల్కి సినిమా మహాభారతంపై ఓ ఆసక్తికరమైన చర్చని లేవనెత్తింది. భారతంలోని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథను మలిచాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఇందులో కర్ణుడు, అర్జునుడి ప్రస్తావన ఉంది. కల్కి క్లైమాక్స్ అద్భుతంగా పండటానికి కారణం.. మహాభారతంలోనే ఈ రిఫరెన్సే. ఇందులో కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ప్రభాస్ హీరో.. కర్ణుడి పాత్రలో ధీరోదాత్తంగా కనిపించాడు. దీంతో అసలు భారతంలో అందరికంటే పరాక్రమవంతుడు కర్ణుడే. అని కొందరు పోస్టులు పెట్టడం మొదలు పెట్టkalki{#}vijay deverakonda;NTR;Prabhas;vijay kumar naidu;Cinema;Directorకల్కి తెచ్చిన తంటా: కర్ణుడు, అర్జునుడు.. ఎవరు గొప్ప?కల్కి తెచ్చిన తంటా: కర్ణుడు, అర్జునుడు.. ఎవరు గొప్ప?kalki{#}vijay deverakonda;NTR;Prabhas;vijay kumar naidu;Cinema;DirectorSat, 29 Jun 2024 08:35:00 GMTకల్కి సినిమా మహాభారతంపై  ఓ ఆసక్తికరమైన చర్చని లేవనెత్తింది. భారతంలోని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథను మలిచాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఇందులో కర్ణుడు, అర్జునుడి ప్రస్తావన ఉంది. కల్కి క్లైమాక్స్ అద్భుతంగా పండటానికి కారణం.. మహాభారతంలోనే ఈ రిఫరెన్సే. ఇందులో కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ కనిపించారు.


ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ప్రభాస్ హీరో.. కర్ణుడి పాత్రలో ధీరోదాత్తంగా కనిపించాడు. దీంతో అసలు భారతంలో అందరికంటే పరాక్రమవంతుడు కర్ణుడే. అని కొందరు పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. అయితే భారతం గురించి కొంచెం లోతుగా అవగాహన ఉన్న వారు మాత్రం ప్రామాణికంగా చూసే వ్యాస భారతాన్ని ఉటంకిస్తూ అసలు అర్జునుడి కంటే కర్ణుడు ఎంత బలమైన వాడో.. ఎన్నో యుద్ధాల్లో ఓడిపోయాడో పర్వాలతో సహా చూపుతున్నారు.


భారతంలోని శకుని, దుర్యోధనుడు, దుశ్వాసనుడు, కర్ణుడు ఈ నలుగురు చెడ్డపనులకు ప్రతీతి. స్వయంగా వ్యాస భగవానుడే ఈ నులగురిని దుష్టం చతుష్టయం అని అభివర్ణించారని, అభిమన్యుడిని చంపిన వారిలో కర్ణుడొకరని.. చివరికి అర్జునుడి చేతిలోనే వధించబడ్డారని గుర్తు చేస్తూ అర్జునుడి కంటే కర్ణుడు ఎందులోను గొప్పవాడు కాదని కొందరు వాదిస్తున్నారు.


నిజానికి పురాణాల ఆధారంగా ఏ సినిమా వచ్చినా ఇలాంటి చర్చలే మొదలైతాయి. గతంలో కూడా కొన్ని సినిమాలు పురాణాలను వక్రీకరించాయనే విమర్శలు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ వక్రీకరణ సినిమాల్లో కాదు. పుస్తకాల్లో ప్రవచనాల్లో కూడా జరుగుతోంది. కర్ణుడి గొప్పదనం గురించి ప్రవచనం  చెప్పమంటే.. అతనంత వీరుడు శూరుడు మరొకరు లేరని చెబుతుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. పాత్ర చేసే హీరోని బట్టి కొన్ని సన్నివేశాలు నడుస్తూ ఉంటాయి.


గతంలో ఎన్టీఆర్ అర్జునుడి పాత్ర ధరిస్తే.. కర్ణుడు యుద్దంలో భయపడి పారిపోయినట్లు చిత్రీకరించారు. అదే ఎన్టీఆర్ కర్ణుడి పాత్ర వేసినప్పుడు యుద్ధ భూమిలో కర్ణునుడిని చూసి వణికిపోయినట్లు చూపించారు. ఇదంతా కథపై ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి సినిమా అనేది వినోదం కోసం మాత్రమేనని ఇందులో మరే కోణాన్ని చూడొద్దనేది విశ్లేషకుల అభిప్రాయం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>