PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-farmers-alter-crop-sowing-patterns-due-to-deficit-rainse46f9311-f10a-474c-823a-42813f627a9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana-farmers-alter-crop-sowing-patterns-due-to-deficit-rainse46f9311-f10a-474c-823a-42813f627a9f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఖరీప్ సీజన్ కావడంతో ఇప్పటికే పొలాల్లో పంటలు వేశారు. ఈ పంటల కోసం రైతులు ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని పెరిగిన పెట్టుబడులు రైతులపై ఒకింత ఎక్కువగానే ప్రభావం చూపాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా ఇప్పటికే 2,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. chandrababu naidu{#}Y. S. Rajasekhara Reddy;Narendra Modi;CM;CBNరైతుభరోసా కోసం రోడ్డెక్కుతున్న రైతు సంఘాలు.. బాబు జాగ్రత్త పడాల్సిందే!రైతుభరోసా కోసం రోడ్డెక్కుతున్న రైతు సంఘాలు.. బాబు జాగ్రత్త పడాల్సిందే!chandrababu naidu{#}Y. S. Rajasekhara Reddy;Narendra Modi;CM;CBNFri, 28 Jun 2024 11:14:00 GMTమోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా ఇప్పటికే 2,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే.
 
కూటమి సర్కార్ వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ ను అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేస్తుండగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. అయితే ఈ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారంటూ కలెక్టరేట్ల ఎదుట రైతు సంఘాలు ఆందోళనలు చేస్తుండటం గమనార్హం. కూటమి ఏపీలో విజయం సాధించడంతో రైతుల పాత్ర కీలకమని చెప్పవచ్చు.
 
అలాంటి రైతులను ఇబ్బంది పెడితే కూటమికే నష్టమని రైతు భరోసా మొత్తాన్ని ఎన్ని విడతల్లో జమ చేస్తారో కూడా కూటమి సర్కార్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఈ మొత్తంలో కేంద్రంలో వాటా 6000 కాగా రాష్ట్రం వాటా 14000 కావడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ ఎప్పటినుంచి పథకాలను అమలు చేస్తుందో క్లారిటీ ఇస్తే రైతులకు ఒకింత టెన్షన్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.
 
చంద్రబాబు నాయుడు రాబోయే ఐదు నెలల్లో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తే బెస్ట్ సీఎం అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. అన్నదాత సుఖీభవ స్కీమ్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ ను వేగంగా అమలు చేస్తే కూటమి సర్కార్ కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు మిగతా పథకాల విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. రాష్ట్రంలోని ఇతర సమస్యలను సైతం బాబు వేగంగా పరిష్కరించాల్సి ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>