EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddyc130bc74-aee2-4af4-9f5a-7be14649d6b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddyc130bc74-aee2-4af4-9f5a-7be14649d6b5-415x250-IndiaHerald.jpgపాతబస్తీలో కరెంటు బిల్లులు చాలా వరకూ వసూలు కావు.. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నదే. అక్కడ బిల్లు వసూళ్ల కోసం పట్టుబట్టాలంటే అధికారులు కూడా భయపడుతుంటారు. ఎన్నాళ్ల నుంచో ఇదే పరిస్థితి ఉంది. అలాగని కరెంటు కట్‌ చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ సీన్ మారడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై ఫోకస్‌ పెట్టింది. ఎలాగైనా పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయాలని ప్లాన్ చేసింది. హైదరాబాద్‌ పాతబస్తీలో 40 శాతం విద్యుత్తు బిల్లులు వసూలు కావడంలేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. దీrevanth reddy{#}District;electricity;Telangana;Revanth Reddy;CM;Reddyపాతబస్తీ కరెంటు బిల్లులు పక్కా వసూల్‌.. రేవంత్‌రెడ్డి కొత్త ప్లాన్‌?పాతబస్తీ కరెంటు బిల్లులు పక్కా వసూల్‌.. రేవంత్‌రెడ్డి కొత్త ప్లాన్‌?revanth reddy{#}District;electricity;Telangana;Revanth Reddy;CM;ReddyFri, 28 Jun 2024 09:00:00 GMTపాతబస్తీలో కరెంటు బిల్లులు చాలా వరకూ వసూలు కావు.. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నదే. అక్కడ బిల్లు వసూళ్ల కోసం పట్టుబట్టాలంటే అధికారులు కూడా భయపడుతుంటారు. ఎన్నాళ్ల నుంచో ఇదే పరిస్థితి ఉంది. అలాగని కరెంటు కట్‌ చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ సీన్ మారడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై ఫోకస్‌ పెట్టింది. ఎలాగైనా పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయాలని ప్లాన్ చేసింది.


హైదరాబాద్‌ పాతబస్తీలో 40 శాతం విద్యుత్తు బిల్లులు వసూలు కావడంలేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. దీన్ని సరిదిద్దడానికి అదానీ వాళ్లను పిలిచామని ఇటీవల వెల్లడించారు. పాతబస్తీలో ఇక్కడి నుంచి 75 శాతం బిల్లు వసూలుచేసే బాధ్యతలను అదానీ సంస్థకు అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పాతబస్తీలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


అలాగే తెలంగాణలో ప్రాంతీయ రింగు రోడ్డు ద్వారా 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో పోర్టులకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు వేస్తున్నామనీ, డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటెయినర్లు ఇక్కడికే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాజస్థాన్‌లో మాదిరి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.


అలాగే రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వి, ఆ ప్రాంతాలను చెరువులుగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కొత్త విషయం వెల్లడించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెంట 24 రేడియల్‌ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ రేడియల్ రోడ్ల వల్ల హైదరాబాద్‌లోని ఏ ప్రాంతానికైనా అర గంటలో చేరుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు అవుటర్‌ రింగురోడ్లు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2050కల్లా గ్రీన్‌ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>