Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/star-anchor-pye-asaktikara-vyakhyalu-chesina-tamila-star-nirmatace94c066-b550-4ec8-bd4a-a6989574a4b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/star-anchor-pye-asaktikara-vyakhyalu-chesina-tamila-star-nirmatace94c066-b550-4ec8-bd4a-a6989574a4b8-415x250-IndiaHerald.jpgయాంకర్ సుమ గురించి బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. ఒక షో కానీ, ఈవెంట్ కానీ తన మాటలతో, పంచ్ టైమింగ్‌తో ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా మారుస్తారు. ఎలాంటి సెలబ్రిటీ అయిన తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అలాంటి సుమ కనకాల హోస్టింగ్‌పై తమిళ స్టార్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు.అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతల్లో ఒకరైన కేఈ జ్ఞానవేల్ రాజా హాజరయ్యారు. అయితే, ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ సంసsocialstars lifestyle{#}suma;suma kanakala;Remake;srinivas;raja;Event;Tamil;media;Telugu;Jawaan;producer;Producer;Cinemaస్టార్ యాంకర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ నిర్మాత..?స్టార్ యాంకర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ నిర్మాత..?socialstars lifestyle{#}suma;suma kanakala;Remake;srinivas;raja;Event;Tamil;media;Telugu;Jawaan;producer;Producer;CinemaFri, 28 Jun 2024 21:40:23 GMTయాంకర్ సుమ గురించి బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. ఒక షో కానీ, ఈవెంట్ కానీ తన మాటలతో, పంచ్ టైమింగ్‌తో ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా మారుస్తారు. ఎలాంటి సెలబ్రిటీ అయిన తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అలాంటి సుమ కనకాల హోస్టింగ్‌పై తమిళ స్టార్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఆసక్తికర కామెంట్స్ చేశారు.అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాతల్లో ఒకరైన కేఈ జ్ఞానవేల్ రాజా హాజరయ్యారు. అయితే, ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ సంస్థ కండక్ట్ చేసింది. అలాగే కార్యక్రమాన్ని శ్రేయాస్ శ్రీనివాస్ కూతురు ఆధ్య హోస్ట్ చేసింది. ఆమె హోస్టింగ్‌ను మెచ్చుకుంటూ యాంకర్ సుమపై కేఈ జ్ఞానవేల్ రాజా సరదాగా కామెంట్ చేశారు.

"హైదరాబాద్‌లోని మీడియా మిత్రులను, తెలుగు ఆడియెన్స్‌ను, ఇక్కడి మంచి ఫుడ్‌ను మిస్ అవుతుంటాను. మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న ఆధ్య.. శ్రేయాస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తను బాగా హోస్టింగ్ చేస్తోంది. సుమ గారి ఈవెంట్స్ నెంబర్ ఆధ్య క్రాస్ చేయాలని కోరుకుంటున్నా" అని కేఈ జ్ఞానవేల్ రాజా అన్నారు. దాంతో అంతా నవ్వేశారు.

"గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ కలిసి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాతో జీవీ ప్రకాష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్  బాగా సపోర్ట్ చేశారు" అని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలిపారు."డైరెక్టర్ శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్‌ను ఎక్కువ నమ్మాను. ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు" అని నిర్మాత చెప్పుకొచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>