PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/keeravani-punches-and-jabs-at-jagan-rule-are-not-usualfc862a5f-a0a8-4e8c-afdc-aba2b11a8dfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/keeravani-punches-and-jabs-at-jagan-rule-are-not-usualfc862a5f-a0a8-4e8c-afdc-aba2b11a8dfc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం. ఎం. కీర‌వాణి స్వ‌త‌హాగా వివాదాల‌కు దూరంగా ఉంటారు. ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న ఒక్క‌రు మాత్ర‌మే కాదు.. ఆ ఫ్యామిలీయే వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌మ ప‌ని తాము చేసుకు పోతూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీలో కీర‌వాణి వివాదాల త‌న చుట్టూ ఏ మాత్రం ద‌రిచేర నీయ‌కుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటి నెమ్మ‌ద‌స్తుడికే ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ పై ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చిన‌ట్లు ఉంది. దీని బ‌య‌ట పెట్టేందుకు ఈనాడు అధినేత‌, దివంగ‌త రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌నే వేదిక గా చేసుకుని త‌న మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌టAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; Keeravani{#}vedhika;eenadu;ramoji rao;CM;media;Andhra Pradesh;Telugu;YCPజ‌గ‌న్ పాల‌న‌పై కీర‌వాణి పంచ్‌లు, చుర‌క‌లు... మామూలుగా లేవే..?జ‌గ‌న్ పాల‌న‌పై కీర‌వాణి పంచ్‌లు, చుర‌క‌లు... మామూలుగా లేవే..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; Keeravani{#}vedhika;eenadu;ramoji rao;CM;media;Andhra Pradesh;Telugu;YCPFri, 28 Jun 2024 10:45:32 GMTటాలీవుడ్ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం. ఎం. కీర‌వాణి స్వ‌త‌హాగా వివాదాల‌కు దూరంగా ఉంటారు. ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న ఒక్క‌రు మాత్ర‌మే కాదు.. ఆ ఫ్యామిలీయే వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌మ ప‌ని తాము చేసుకు పోతూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీలో కీర‌వాణి వివాదాల త‌న చుట్టూ ఏ మాత్రం ద‌రిచేర నీయ‌కుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటి నెమ్మ‌ద‌స్తుడికే ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ పై ప‌ట్ట‌రాని కోపం వ‌చ్చిన‌ట్లు ఉంది. దీని బ‌య‌ట పెట్టేందుకు ఈనాడు అధినేత‌, దివంగ‌త రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌నే వేదిక గా చేసుకుని త‌న మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు ప‌రోక్షంగా క‌క్కేశారు.


కీర‌వాణి వైసీపీ అధినేత .. మాజీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై గ‌త ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. తాజాగా జ‌రిగిన‌ రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. రామోజీరావు తో త‌మ‌కు ఉన్న అనుభ‌వాలు... స్మృతుల‌ను గుర్తు చేసుకొనే సంద‌ర్భంలో కీర‌వాణి ఇలా మాట్లాడారు.  ప్ర‌తి ఒక్క‌రు బ‌తికితే రామోజీరావులా బ‌త‌కాల‌ని ఓ స‌భ‌లో నేను అన్నాను.... అలాగే మ‌ర‌ణించినా ఆయ‌న‌లానే మ‌ర‌ణించాలి అని ఇప్పుడు అంటున్నాన‌ని చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. త‌న మ‌ర‌ణాన్ని, త‌న మృత్యువునీ ఆపి ఉత్త‌రాయ‌ణం వ‌చ్చేంత వ‌ర‌కూ వాయిదా వేశార‌ని చెపుతూనే... అలాగే రామోజీరావు తాను ఎంత‌గానో ప్రేమించే ఆంధ్ర ప్ర‌దేశ్ క‌బంద హ‌స్తాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఆయ‌న క‌ళ్లారా చూసి ఇప్పుడు నిష్క్ర‌మించార‌ని కీర‌వాణి అన్నారు.


మ‌ర‌ణించినా కూడా ఆయ‌న‌లాగే మ‌ర‌ణించాల‌ని అంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్ పాల‌న‌పై.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేశారు. తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌బంద హ‌స్తాల నుంచి బ‌య‌ట ప‌డ్డాకే అన్న మాట జ‌గ‌న్ పాల‌న‌ను ఉద్దేశించే అన్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కీర‌వాణి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా తో పాటు తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లో వైర‌ల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>