Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-jagan22198053-9e6b-4f99-8698-b22770b76f0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-jagan22198053-9e6b-4f99-8698-b22770b76f0b-415x250-IndiaHerald.jpg*ప్రభుత్వ సలహాదారులే జగన్ కొంపముంచారా..? *ఎమ్మెల్యేలకు కూడా ఆపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి *గ్రౌండ్ లెవెల్ సమస్యలు జగన్ కు చేరువ కాకుండా ఆపింది ఎవరూ..? ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఎప్పుడు ఊహించని విధంగా వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకుంది.కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన పార్టీకి ఇంతటి పరాభవం ఎప్పుడు జరగలేదు.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికలలో వైసీపీ ఓడ#jagan{#}village;Grama Sachivalayam;Sajjala Ramakrishna Reddy;Raccha;Jagan;YCP;local languageజగన్ 2029 : ఆ ఒక్క పని చేస్తే ఈ సారి భారీ గెలుపు గ్యారెంటీ..జగన్ 2029 : ఆ ఒక్క పని చేస్తే ఈ సారి భారీ గెలుపు గ్యారెంటీ..#jagan{#}village;Grama Sachivalayam;Sajjala Ramakrishna Reddy;Raccha;Jagan;YCP;local languageThu, 27 Jun 2024 08:34:00 GMT*ప్రభుత్వ సలహాదారులే జగన్ కొంపముంచారా..?

*ఎమ్మెల్యేలకు కూడా ఆపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి
 
*గ్రౌండ్ లెవెల్ సమస్యలు జగన్ కు చేరువ కాకుండా ఆపింది ఎవరూ..?

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఎప్పుడు ఊహించని విధంగా వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకుంది.కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించిన పార్టీకి ఇంతటి పరాభవం ఎప్పుడు జరగలేదు.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడానికి చాలా కారణాలే వున్నాయి. వీటిలో అసలైన కారణం ప్రభుత్వ సలహాదారులు జగన్ పరిపాలనను అడ్డు పెట్టుకొని వారు రాష్ట్రాన్ని శాసిస్తూ వచ్చారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన కొన్ని తప్పుడు సలహాల కారణంగా జగన్ ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల కోట్ల సంక్షేమ పధకాలు ప్రతి గడప గడపకు చేరువయ్యేలా చేసారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థ.. వీటితో పాలనలో జగన్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.

గ్రామంలోని, పట్టణంలోని ప్రతి వార్డ్ కి సచివాలయం ఏర్పాటు చేసి పాలనలో మార్పు తెచ్చారు. దాని వల్ల కొన్ని లాభాలు జరిగిన కూడా అత్యధికంగా నష్టాలే ఎక్కువ మొదలయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ వల్ల గ్రామ సర్పంచ్ పదవి వుండి లేనట్లు గానే మారింది. గ్రామం లో ఏ అవసరం అయినా కూడా గ్రామ సభ లో సర్పంచ్ నేతృత్వంలో చర్చించి ఆ సమస్యలను పరిష్కరించేవారు. అయితే ఇప్పుడు సర్పంచ్ ని పట్టించుకునే వారే లేరు. ఏ అవసరం అయినా కూడా వాలంటీర్ పై ఆధారపడాల్సిందే.. అలాగే సర్పంచ్ లకు గ్రామ అభివృద్ధికి ఇవ్వాలసిన నిధులలో కూడా కోత పెట్టడంతో సర్పంచ్ లు అంతా కలిసి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కే జగన్ ను అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక సమస్య జగన్ వరకు వెళ్లాలంటే ముందు వున్న సలహా దారులను దాటుకోని వెళ్ళాలి. దీనితో జగన్ కు ప్రజలకు దూరం పెరిగిపోయింది..వైఎస్ ఆర్ లాగా రచ్చ బండ కార్యక్రమాలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈ సారి జగన్ గెలుపు ఆపడం ఎవరివల్ల కాదు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>