MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad6efd7474-cf86-4317-810b-28c21436e01e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad6efd7474-cf86-4317-810b-28c21436e01e-415x250-IndiaHerald.jpgఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్రను తీరగరాసే సినిమాగా రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడం ప్రారంభించింది.ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక పడుకోన్ ఇంకా దిశా పటానీ నటించిన ఈ మూవీ ఊహకు అందని విధంగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. అయితే జూన్ 27వ తేదీన అనగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా భారీగా నమోదు చేసింKalki 2898 AD{#}Hindi;News;thursday;Telugu;deepika;nag ashwin;vijay kumar naidu;Cinema;June;Audienceకల్కి 2898 AD: ఫస్ట్ డే దిమ్మ తిరిగే వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?కల్కి 2898 AD: ఫస్ట్ డే దిమ్మ తిరిగే వసూళ్లు.. ఎన్ని కోట్లంటే?Kalki 2898 AD{#}Hindi;News;thursday;Telugu;deepika;nag ashwin;vijay kumar naidu;Cinema;June;AudienceThu, 27 Jun 2024 20:23:00 GMTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చరిత్రను తీరగరాసే సినిమాగా రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడం ప్రారంభించింది.ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక పడుకోన్ ఇంకా దిశా పటానీ నటించిన ఈ మూవీ ఊహకు అందని విధంగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. అయితే జూన్ 27వ తేదీన అనగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా  600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా భారీగా నమోదు చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 180 కోట్ల రూపాయలు కాగా, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, హిందీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో 85 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ మూవీ థియేట్రికల్ హక్కులు 385 కోట్ల రూపాయలుగా నమోదైంది.ఇంకా అలాగే ఈ కల్కి 2898 AD చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 400 స్క్రీన్లు, ఆంధ్రాలో 850 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 1250 స్క్రీన్లలో, హిందీలో 2000 స్క్రీన్లలో, కేరళ, కర్ణాటక ఇంకా తమిళనాడులో 750 స్క్రీన్లలో కలిపి ఇండియాలో మొత్తం 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్‌లో 4500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. 


మొత్తంగా ఈ మూవీని  9500మధ్య స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక కల్కి 2898 ఏడీ మూవీకి అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కూడా కళకళలాడటంతో రికార్డు స్థాయిలో ఫుట్‌ఫాల్స్ అనేవి నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించిన టికెట్లు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లాంటి మల్టీప్లెక్స్‌లో గురువారం ఉదయం ఏకంగా 12 వేల టికెట్లకి పైగా అమ్ముడుపోయాయి.ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాంలో 35 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 6 కోట్ల గ్రాస్, తమిళనాడులో 3 కోట్ల గ్రాస్, కేరళలో 50 లక్షల గ్రాస్ ఇంకా అలాగే హిందీలో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో 3.5 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసింది. అలాగే మిగితా దేశాల్లో కూడా భారీగానే వసూళ్లు సాధించింది.ఇక కల్కి 2898 ఏడీ సినిమా మొదటి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా  250 కోట్ల దాకా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు నుంచి సమాచారం తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>