PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy1f67287f-aa40-495a-abd4-039b05ad8f59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy1f67287f-aa40-495a-abd4-039b05ad8f59-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో చూస్తే జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేరు. ఎంత ఢక్కామెక్కీలు తిన్నవారు అయినా ఓటమి బాధ నుంచి తట్టుకోవడం కష్టమే.2019లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం 23 సీట్లు మాత్రమే దక్కడంతో ఇలా ఎందుకు జరిగింది అని వగచి వాపోయారు.కొన్నాళ్ల పాటు ఆయన అదే మాట్లాడుతూ ఉండేవారు. ఆ తరువాత బాబు తనదైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక జగన్ విషయం చూస్తే ఆయన చుట్టూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఆయన అందులోనే ఉంటారు అని అంటారు. ఆయన ఎక్కువగా ఎవరినీ కలవరు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపధ్యలో భారీ ఓటమjaganmohanreddy{#}CM;Government;Bank;CBN;MLA;TDP;Andhra Pradesh;Jagan;YCP;Partyవైసీపీ: సీట్లు కాదు.. ఓట్లు..ముఖ్యమంటూ కొత్త ప్రచారం..!వైసీపీ: సీట్లు కాదు.. ఓట్లు..ముఖ్యమంటూ కొత్త ప్రచారం..!jaganmohanreddy{#}CM;Government;Bank;CBN;MLA;TDP;Andhra Pradesh;Jagan;YCP;PartyThu, 27 Jun 2024 08:00:00 GMTరాజకీయాల్లో చూస్తే జయాపజయాలు సర్వసాధారణం. అయితే ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేరు. ఎంత ఢక్కామెక్కీలు తిన్నవారు అయినా ఓటమి బాధ నుంచి తట్టుకోవడం కష్టమే.2019లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం 23 సీట్లు మాత్రమే దక్కడంతో ఇలా ఎందుకు జరిగింది అని వగచి వాపోయారు.కొన్నాళ్ల పాటు ఆయన అదే మాట్లాడుతూ ఉండేవారు. ఆ తరువాత బాబు తనదైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక జగన్ విషయం చూస్తే ఆయన చుట్టూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. ఆయన అందులోనే ఉంటారు అని అంటారు. ఆయన ఎక్కువగా ఎవరినీ కలవరు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపధ్యలో భారీ ఓటమి బాధకు తగిన ఓదార్పు లేక ఆయన అల్లాడిపోయారు అని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు పడ్డాయని, 2029లో జగనే సీఎం అని నమ్మకంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.ఎన్నికల ఫలితాలు బేరీజు వేయాలంటే ఎవరికైనా సీట్లే ప్రామాణికం కానీ ఓట్లే ప్రామాణికం అంటోంది వైసీపీ. ఏపీ ఎన్నికల్లో తమకు 40శాతం మంది ప్రజలు మద్దతిచ్చారని చెబుతోంది. 11 సీట్లు అనే విషయాన్ని పక్కనపెట్టి 40శాతం సీట్లు అనే విషయాన్నే హైలైట్ చేయాలనుకుంటోంది. జగన్ కూడా స్పీకర్ కి రాసిన లేఖలో ఈ విషయాన్నే హైలైట్ చేశారు. తమకు 40శాతానికి పైగా ఓట్లు పడ్డాయని చెప్పారాయన. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని స్పీకర్ కు గుర్తు చేశారు జగన్.చంద్రబాబు ఎన్ని వాగ్దానాలిచ్చినా, మూడు పార్టీలు కలసినా కూడా తమకు 40శాతం ఓట్లు వచ్చాయని, అందుకే తమని చూసి కూటమి ఇంకా భయపడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ప్రభుత్వం ఏది చెబితే అది అధికారులు చేయకూడదని, మళ్లీ వైసీపీయే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆలోచించి పనిచేయాలని హితవుపలికారు.
2029లో జగనే సీఎం అవుతారంటూ ప్రజలు కూడా చెబుతున్నారని వైసీపీ ధీమాగా ఉంది. ఈమేరకు కొంతమంది వైసీపీ అభిమానులు చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 40శాతం ఓటు బ్యాంక్ తో వైసీపీ బలమైన స్థానంలో ఉందని, ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>