BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-healthbec9f91c-f78c-444f-b36e-60843217d235-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/hair-healthbec9f91c-f78c-444f-b36e-60843217d235-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోయేందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా కాలుష్యం, జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు చాలా ఈజీగా రాలిపోతోంది. దీంతో చాలా మంది జుట్ట రాలిపోతుందని ఎంతగానో ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్‌లో లభించే చాలా రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. ఖరీదైన చికిత్సలను కూడా చేయించుకుంటారు. కానీ వాటితో ఎటువంటి ఫలితం ఉండడం లేదు.మన చిన్నతనంలో మన అమ్మలు, అమ్మమ్మలుHair Health{#}oil;Manamహెయిర్ ఫాల్ సమస్యా? ఇలా చేస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది?హెయిర్ ఫాల్ సమస్యా? ఇలా చేస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది?Hair Health{#}oil;ManamThu, 27 Jun 2024 21:52:00 GMT ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోయేందుకు చాలా కారణాలు ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా కాలుష్యం, జీవన విధానంలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు చాలా ఈజీగా రాలిపోతోంది. దీంతో చాలా మంది జుట్ట రాలిపోతుందని ఎంతగానో ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్‌లో లభించే చాలా రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. ఖరీదైన చికిత్సలను కూడా చేయించుకుంటారు. కానీ వాటితో ఎటువంటి ఫలితం ఉండడం లేదు.మన చిన్నతనంలో మన అమ్మలు, అమ్మమ్మలు ఇంకా నాయనమ్మలు ఎంతో పొడవుగా, దృఢంగా ఉండే జుట్టుని కలిగి ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుగా అప్పట్లో ఎలాంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్  లేవు. ఖరీదైన చికిత్సలు కూడా లేవు. అంతా కూడా సహజసిద్ధంగా జరిగేది. అందువల్లే అప్పటి తరం వారి జుట్టు అంత పొడవుగా ఇంకా అంత దృఢంగా ఉండేది. ఇందుకు వారు ఇంట్లో ఉపయోగించే పలు సహజసిద్ధమైన చిట్కాలే కారణం అని చెప్పవచ్చు.అందుకే వీటిని వాడడం వల్లే వారు తమ జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుకునేవారు. దీంతో శిరోజాలు దృఢంగా ఇంకా చాలా బలంగా ఉండేవి. 


అలాగే ఎంతో పొడవుగా కూడా పెరిగేవి.ఇప్పుడు చెప్పే టిప్ ని మీ జుట్టుకి అప్లై చేయడం వల్ల మీ జుట్టు చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. అలాగే జుట్టు పొడవుగా పెరిగి ఇంకా మృదువుగా కూడా అవుతుంది. అయితే ఇందుకు గాను మీరు మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెను ఇప్పుడు చెప్పబోయే పదార్థాలతో మిక్స్ చేసి వాడితే చాలు. ఇక ఆ చిట్కా ఏమిటో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆముదం 2 టీస్పూన్లు, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టీస్పూన్‌ ఇంకా అలాగే కరివేపాకులు 5 లేదా 6 తీసుకోవాలి.ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొబ్బరినూనె వేసి వేడి చేయాలి.తరువాత అందులోనే మెంతులు, కరివేపాకులు కూడా వేసి బాగా వేయించాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక వాటిని ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఆ తరువాత దాన్ని వడకట్టి అందులో ఆముదం వేసి కలపాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి.ఆ తరువాత 1 గంట సేపు శుభ్రంగా ఆగి తలస్నానం చేయాలి. ఇలా ఖచ్చితంగా వారంలో కనీసం 2 సార్లు చేయాలి. దీంతో జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. అలాగే శిరోజాలు ఒత్తుగా, దృఢంగా కూడా పెరుగుతాయి. ఇంకా అలాగే కాంతివంతంగా మారుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>