MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagif61d86e4-1abf-4a73-bd94-16ed952fce85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagif61d86e4-1abf-4a73-bd94-16ed952fce85-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా ఎక్కువ శాతం సీరియస్ పాత్రలలోనే నటిస్తూ వస్తున్నాడు. దానితో ఆయన అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రభాస్ ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తే బాగుంటుంది అని ఆశను కూడా వారు అప్పటి నుండో వెళ్లబోచ్చుతు వస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ప్రభాస్ ఇప్పట్లో కామెడీ సినిమాలో నటnagi{#}maruti;raja;Success;News;Audience;Mahanati;nag ashwin;Prabhas;vijay kumar naidu;Comedy;Cinemaకల్కి 2898 AD : ఈ కథతో కూడా కామెడీని పండించాడంటే గ్రేట్ నాగ్ అశ్విన్..!కల్కి 2898 AD : ఈ కథతో కూడా కామెడీని పండించాడంటే గ్రేట్ నాగ్ అశ్విన్..!nagi{#}maruti;raja;Success;News;Audience;Mahanati;nag ashwin;Prabhas;vijay kumar naidu;Comedy;CinemaThu, 27 Jun 2024 16:05:00 GMTప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా ఎక్కువ శాతం సీరియస్ పాత్రలలోనే నటిస్తూ వస్తున్నాడు. దానితో ఆయన అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రభాస్ ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తే బాగుంటుంది అని ఆశను కూడా వారు అప్పటి నుండో వెళ్లబోచ్చుతు వస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానితో ప్రభాస్ ఇప్పట్లో కామెడీ సినిమాలో నటించడం కష్టమే కాస్త ఉంటే మారుతి సినిమాలోనే ప్రభాస్ నుండి కామెడీ ఉండొచ్చు అని చాలా మంది జనాలు ఫిక్స్ అయ్యారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. నాగ్ ఈ మూవీ కంటే ముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలలో అక్కడ, ఇక్కడ కాస్త కామెడీ మినహాయిస్తే ఇవి రెండు కూడా సీరియస్ సినిమాలే. దానితో కల్కి సినిమాలో కామెడీ ఉంటుంది అని దాదాపుగా ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఊహించలేదు.

కానీ అనుహంగా ఈ సినిమాలో నాగ్ కామెడీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ తో కామెడీ పండించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ సినిమాలో చాలా మంది నటులతో ప్రభాస్ కామెడీని పండించాడు. ముఖ్యంగా ఈయన ఎంట్రీ సీన్ లో కూడా బుజ్జి అనే వెహికిల్ తో సాగే సంభాషణతో కామెడీగానే ఉంది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. ఇలా ఇంత సీరియస్ కథలో కామెడీ పెట్టడం మాత్రమే కాకుండా దానితో ప్రేక్షకులను బాగానే అలరించడంలో నాగి ఫుల్ గా సక్సెస్ అయ్యాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>